YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఉపాధ్యాయులను అరెస్టు చేయడం పట్ల టీడీపీ నాయకులు ఆగ్రహం

ఉపాధ్యాయులను అరెస్టు చేయడం పట్ల టీడీపీ నాయకులు ఆగ్రహం

అమరావతి ఏప్రిల్ 25
సీపీఎస్‌ను కొనసాగించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయులు చేపట్టిన ఛలో సీఎంవో లో ఉపాధ్యాయులను అరెస్టు చేయడం పట్ల టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులను విజయవాడకు రాకుండా భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించి ఎక్కడికక్కడ నిర్బంధించడం పట్ల టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌ , ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, సీనియర్‌ నాయకుడు యనమల రామకృష్ణుడు తీవ్రంగా ఖండించారు.ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీ మేరకు సీసీఎస్‌ను కొనసాగించాలని శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వస్తున్న ఉపాధ్యాయులను అరెస్టు చేయడం ఎంత వరకు సమంజసమని నారా లోకేశ్‌ అన్నారు. ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వ నిర్బంధకాండను ఖండిస్తున్నామని పేర్కొన్నారు. యనమల మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని సీఎం జగన్‌ కాలరాస్తున్నారని ఆరోపించారు. నిరసన ధర్నాకు ఆంక్షలు విధించి, ముళ్లకంచెలు పెట్టడం దారుణమని అన్నారు. ఏపీలో ఉన్న ఆంక్షలు కశ్మీర్‌ సరిహద్దులో కూడా లేవని మండిపడ్డారు.అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఉపాధ్యాయ, ఉద్యోగుల సీపీఎస్‌ పోరుకు మద్దతిస్తామని వెల్లడించారు. అధికారంలోకి రాగానే వారంలో సీపీఎస్‌ రద్దు చేస్తానని ఎన్నికల్లో జగన్‌ హామీ ఇచ్చారు, ఇచ్చిన హామీని సీఎం మర్చిపోయినా ఉద్యోగులు మర్చిపోలేదని గుర్తు చేశారు.

Related Posts