YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

తెలంగాణ వ్య‌తిరేకుల‌ను నేల‌కేసి కొడతాం మంత్రి నిరంజ‌న్ రెడ్డి

తెలంగాణ వ్య‌తిరేకుల‌ను నేల‌కేసి కొడతాం  మంత్రి నిరంజ‌న్ రెడ్డి

హైద‌రాబాద్ ఏప్రిల్ 26
రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను దెబ్బ‌తీస్తోన్న తెలంగాణ వ్య‌తిరేకుల‌ను స‌రైన స‌మ‌యంలో నేల‌కేసి కొడుతామ‌ని వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. తెలంగాణ వ్య‌తిరేకులు ఆది నుంచి కుట్ర‌లు చేస్తున్నారని ధ్వ‌జ‌మెత్తారు. తెలంగాణ పున‌ర్నిర్మాణాన్ని తాము గురుత‌ర బాధ్య‌త‌గా భావిస్తున్నామని నిరంజ‌న్ రెడ్డి తేల్చిచెప్పారు.తెలంగాణ భ‌వ‌న్‌లో మంత్రి నిరంజ‌న్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. గుజ‌రాత్ ఏర్ప‌డి 62 ఏండ్లైనా క‌రెంట్ క‌ష్టాలున్నాయి. ఎనిమిదేండ్ల‌లో తెలంగాణ‌లో 24 గంట‌ల విద్యుత్ అందిస్తున్నాం. సంక్షేమం మీద అత్య‌ధికంగా ఖ‌ర్చు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్ర‌మే అని స్ప‌ష్టం చేశారు. తెలంగాణ‌లో అమ‌ల‌వుతున్న సంక్షేమ ప‌థ‌కాలు దేశంలో ఎక్క‌డా లేవ‌న్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి ప‌థ‌కాలు లేవ‌ని స్ప‌ష్టం చేశారు. ఆక‌ర్ష‌ణీయ నినాదాలు ఇవ్వ‌డంలో బీజేపీ ఫ‌స్ట్ ఉంటుంద‌ని నిరంజ‌న్ రెడ్డి విమ‌ర్శించారు.తెలంగాణ‌కు ఇత‌ర ఏ రాష్ట్రాలు ద‌రిదాపుల్లో కూడా లేవని మంత్రి స్ప‌ష్టం చేశారు. తెలంగాణ ఏడేండ్ల స‌గ‌టు ఆర్థిక వృద్ధిరేటు 11.7 శాతంగా ఉంద‌న్నారు. భార‌త‌దేశం స‌గ‌టు ఆర్థిక వృద్ధిరేటు 6 శాత‌మే అని తెలిపారు. తెలంగాణ జీఎస్‌డీపీలో వ్య‌వ‌సాయ రంగందే 21 శాతం అని పేర్కొన్నారు. విద్యుత్ వినియోగంలో తెలంగాణ నంబ‌ర్ వ‌న్‌గా ఉంద‌న్నారు. ఐటీ, పెట్టుబ‌డుల ఆక‌ర్ష‌ణ‌లో తెలంగాణ‌నే ముందుంద‌న్నారు. పెట్టుబ‌డుల ఉప‌సంహ‌ర‌ణ పేరుతో ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌ను అమ్మేస్తున్నారు. ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లు అమ్మ‌డం ద్వారా రిజ‌ర్వేష‌న్లు అంద‌క న‌ష్ట‌పోతున్నార‌ని తెలిపారు.
మేకిన్ ఇండియా అట్ట‌ర్ ఫ్లాప్
బీజేపీ నాయ‌కులు అవ‌గాహ‌న లేకుండా మాట్లాడుతున్నార‌ని నిరంజ‌న్ రెడ్డి ధ్వ‌జ‌మెత్తారు. తెలంగాణ నుంచి కేంద్రానికి ప‌న్నుల రూపంలో రూ. 3,65,791 కోట్లు చెల్లించామ‌ని గుర్తు చేశారు. కేంద్రం నుంచి హ‌క్కు ప్ర‌కారం తెలంగాణ‌కు వ‌చ్చింది రూ. 1,68,647 కోట్లు అని తెలిపారు.2014లో జీడీపీలో 17.4 శాతం మ్యానుఫ్యాక్ష‌రింగ్ సెక్టార్ ఉండేది. ఈ ఎనిమిదేండ్ల‌లో మ్యానుఫ్యాక్ష‌రింగ్ సెక్టార్ జీడీపీలో 14 శాతానికి పడిపోయింద‌న్నారు. మేకిన్ ఇండియా అట్ట‌ర్ ఫ్లాప్ అయింద‌న్నారు. ఐదు కోట్ల ఉద్యోగాల నుంచి 3 కోట్ల ఉద్యోగాల‌కు ప‌డిపోయింద‌న్నారు. దేశంలో 45 ఏండ్ల‌లో ఎప్పుడూ లేనంత‌గా నిరుద్యోగం పెరిగిపోయింద‌న్నారు. 15 ల‌క్ష‌ల‌కు పైగా కేంద్రంలో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయ‌ని తెలిపారు. మోదీ నియ‌మించుకున్న ఆర్థికవేత్త‌లు త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేస్తున్నారు. ఇప్ప‌టికైనా మోదీ ఆత్మ‌విమ‌ర్శ చేసుకోవాల‌ని సూచించారు.రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు, విద్యాసంస్థలు, వ‌ర్సిటీల కోసం బండి సంజ‌య్ పాద‌యాత్ర చేస్తే బాగుంటుంద‌ని మంత్రి సూచించారు. కృష్ణా న‌దిలో వాటా ఇవ్వాల‌ని యాత్ర చేయాలి. కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు ఏదైనా సాయం చేయాల‌ని యాత్ర చేయాలి. రైతుబంధు, రైతుబీమా దేశ వ్యాప్తంగా అమ‌లు చేయాల‌ని యాత్ర చేయాలి. బండి సంజ‌య్‌కు ఉన్న అవ‌గాహ‌న గుండు సున్నా అని నిరంజ‌న్ రెడ్డి తెలిపారు.

Related Posts