YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఇవాళ గులాబీ ప్లీనరి మీట్

ఇవాళ గులాబీ ప్లీనరి మీట్

హైదరాబాద్, ఏప్రిల్ 26,
తెలంగాణ రాష్ట్ర సమితి(TRS) ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న పార్టీ ప్లీనరీకి హైదరాబాద్‌ మహా నగరం ముస్తాబైంది. హైటెక్స్‌లో బుధవారం జరగనున్న ప్లీనరీకి గులాబీ పార్టీ భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. గులాబీ పండుగ కోసం మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో బుధవారం పార్టీ ప్రతినిధులతో జరుగనున్న ఈ ప్లీనరీకి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులు నగరానికి రానుండటంతో నగరం నలువైపులా స్వాగత తోరణాలు, ప్రధాన కూడళ్లలో పార్టీ జెండాలు, అధినేతల ఫొటోలతో అలంకరించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6వేల మంది TRS ప్రతినిధులు రేపటి ప్లీనరీకి హాజరుకానున్నారు. ఈ నెల 27న జరగబోతోంది ప్లీన‌రీకి హాజ‌ర‌య్యే టీఆర్ఎస్ ప్ర‌జాప్ర‌తినిధుల‌కు నోరూరించే వంట‌కాల‌ను సిద్ధం చేస్తున్నారు. ప్లీన‌రీలోని వంట‌ల ప్రాంగ‌ణం రుచిక‌ర‌మైన వంట‌కాల‌తో ఘుమ‌ఘుమ‌లాడుతోంది. క‌డుపు నిండా భోజ‌నం వ‌డ్డించేందుకు వంట‌కాల‌ను సిద్ధం చేస్తున్నారు. మొత్తం 33 ర‌కాల వెరైటీల‌ను ఏర్పాటు చేశారు. మరో వైపు టీఆర్‌ఎస్‌ పార్టీ ప్లీనరీకి సైబరాబాద్‌ పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 27 జరుగనున్న ఈ సమావేశానికి రెండు వేల మందితో మూడంచెల భద్రతను కల్పిస్తున్నారు. సైబ‌రాబాద్ పోలీసు కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర, జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌ అవినాశ్‌ మహంతి, మాదాపూర్‌ డీసీపీ శిల్పవల్లి, తదితర పోలీసు అధికారులు బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రత్యేక కమాండ్‌ కంట్రోల్‌తో పాటు దాదాపు 300 సీసీ కెమెరాలతో నిరంతరం నిఘాను ఏర్పాటుచేశారు. అక్టోపస్‌, బాంబ్‌ స్కాడ్‌, డాగ్‌ స్కాడ్‌ల తనిఖీలతో పాటు డ్రోన్‌ పెట్రోలింగ్‌ను నిర్వహిస్తున్నారు. సమావేశానికి హాజరయ్యే వారికి కేటాయించిన పాసుల ఆధారంగానే అనుమతి ఉంటుందని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
33 ర‌కాల వెరైటీలు ఇవే..
ఈ ప్లీనరీ విందులో తెలంగాణ రుచులతో పాటు..వివిధ ప్రాంతాలకు చెందిన వంటకాలను అందిస్తున్నారు. తెలంగాణ నాటు కోడి కూర ప్రత్యేకంగా నిలుస్తోంది. మొత్తంగా షడ్రుచోపేత వంటలను వేడివేడిగా వడ్డించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇక ఈ ప్లీనర్లీకి అంచనాకు తగ్గట్లు సదుపాయాలు సమకూర్చారు. ముఖ్యంగా అందరి దృష్టి భోజన ఏర్పాట్లపైనే ఉంది. ఎందుకంటే.. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా అతిథులకు ప్రత్యేక మెనూ సిద్ధం చేశారు. ఈ వేడుకల్లో వెజ్‌, నాన్‌వెజ్‌ స్పెషల్స్‌, రోటి పచ్చళ్ళుతో ఘుమఘుమలాడించే వంటకాలు ఉండనున్నాయి.
డబుల్‌కా మీట, గులాబ్‌జామ్‌, మిర్చిబజ్జీ, రుమాలీ రోటీ, తెలంగాణ నాటు కోడి కూర, చికెన్‌ధమ్‌ బిర్యానీ, ధమ్‌కా చికెన్‌, మిర్చి గసాలు, ఆనియన్‌ రైతా,  మటన్‌కర్రీ, తలకాయ కూర, బోటీదాల్చా, కోడిగుడ్డు పులుసు, బగారా రైస్‌, మిక్స్‌డ్‌ వెజ్‌ కుర్మా, వైట్‌ రైస్‌, మామిడికాయ పప్పు, దొండకాయ కాజుఫ్రై, గుత్తి వంకాయ, చామగడ్డ పులుసు, ములక్కాడ కాజు టమాట కర్రీ వెల్లిపాయ కారం, టమాట, కొత్తిమీర తొక్కు, మామిడికాయ తొక్కు,  పప్పుచారు అప్పడం, పచ్చిపులుసు, ఉలువ చారు క్రీమ్‌, టమాట రసం, పెరుగు, బటర్‌స్కాచ్‌ ఐస్‌క్రీమ్‌, ఫ్రూట్స్‌ స్టాల్‌, అంబలి, బటర్‌ మిల్క్‌.

ఐదేళ్ల తర్వాత ప్లీనరి :
తెలంగాణ రాష్ట్ర సమితి ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న పార్టీ ప్లీనరీకి హైదరాబాద్‌ మహా నగరం ముస్తాబైంది. మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో బుధవారం పార్టీ ప్రతినిధులతో జరుగనున్న ఈ ప్లీనరీకి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులు నగరానికి రానుండటంతో నగరం నలువైపులా స్వాగత తోరణాలు, ప్రధాన కూడళ్లలో పార్టీ జెండాలు, అధినేతల ఫొటోలతో అలంకరించారు. ఈ నేపథ్యంలో నగరమంతా గులాబీమయంగా మారింది.ప్లీనరీ ఏర్పాట్లకు సంబంధించి అధిష్ఠానం నగర నేతలకు కీలక బాధ్యతలు అప్పగించింది. ఆహ్వాన కమిటీలో మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీలను నియమించారు. దీంతో పాటు సభా వేదిక ఏర్పాట్లను హైదరాబాద్‌ జిల్లా పార్టీ అధ్యక్షుడు, జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు, భోజన ఏర్పాట్లను కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌కు అప్పగించారు. దీంతో నేతలు నగరంలో భారీ ఏర్పాట్లు చేశారు. వీరికి తోడు నగర ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు కూడా నగరానికి నలువైపులా పెద్ద ఎత్తున స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు.హెచ్‌ఐసీసీలోని ప్లీనరీ సభా ప్రాంగణంలో మొత్తం 4500 కెపాసిటీతో హాల్‌ను ముస్తాబు చేస్తున్నారు. ఇప్పటి వరకు 2890 మందికి పాస్‌లు జారీ చేసినట్లు పార్టీ నాయకులు తెలిపారు. ఇందులో భాగంగా మొత్తం 3500 మంది ఆహ్వానితులు ప్రాంగణంలోకి చేరుకునేలా ప్రణాళికలు చేస్తున్నారు. సభ ప్రాంగణంలోని వేదిక 40*100 చదరపు అడుగుల విస్తీర్ణంతో 200 మంది కూర్చునేలా తీర్చిదిద్దుతున్నారు.పార్కింగ్‌తో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. హెచ్‌ఐసీసీ వెనకాల వైపు ఏర్పాటు చేసిన పార్కింగ్‌ స్థలంలో 300 కార్లు నిలిపేలా ఏర్పాట్లు చేయగా కొండాపూర్‌ ఆర్‌టీఏ కార్యాలయం నుంచి నూతనంగా ఏర్పాటు చేసిన లింకు రోడ్డు మీదుగా నోవాటెల్‌ వెళ్లే మార్గంలో, న్యాక్‌ గేట్‌ సమీపంలో పార్కింగ్‌ స్థలాలను ఏర్పాటు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు హెచ్‌ఐసీసీ ప్రాంగణంలో ప్రత్యేక పార్కింగ్‌లను ఏర్పాటు చేస్తున్నారు.టీఆర్‌ఎస్‌ పార్టీ ప్లీనరీ సందర్భంగా మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా పూర్తిగా గులాబీ మయమైంది. జిల్లాలోని ప్రధాన కూడళ్లు, జాతీయ రహదారికి ఇరువైపులా టీఆర్‌ఎస్‌ పార్టీ జెండాలు ఏర్పాటు చేసి విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. కూడళ్ల వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, మల్లారెడ్డి ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. కరీంనగర్‌, సిద్దిపేట నుంచి వచ్చే ప్రతినిధులకు శామీర్‌పేట్‌లో, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లా ప్రతినిధులకు మేడ్చల్‌లో, వరంగల్‌ జిల్లాల నుంచి వచ్చే ప్రతినిధులకు బోడుప్పల్‌లో స్వాగతం పలుకనున్నారు.టీఆర్‌ఎస్‌ పార్టీకి హైదరాబాద్‌ మహా నగరానికి అవినాభావ సంబంధం ఉన్నది. నగరం నడిబొడ్డున 2001లో గులాబీ జెండా తొలిసారిగా ఎగిరింది ఇక్కడే. జలదృశ్యం వేదికగా పురుడుపోసుకున్న టీఆర్‌ఎస్‌.. ఉద్యమ ప్రస్థానం నుంచి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నగరానికి సముచిత ప్రాధాన్యం కల్పిస్తూ వస్తున్నది. ముఖ్యంగా హైదరాబాద్‌ను విశ్వ నగరంగా తీర్చిదిద్దేందుకు పెద్ద ఎత్తున మౌలిక వసతులు కల్పించింది. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఇప్పటివరకు నిర్వహించిన ప్లీనరీల్లోనూ నగర వేదికగా పలుసార్లు సంబురాలు జరిగాయి. ఆవిర్భావం తర్వాత 2008, 2015లో పెరేడ్‌ గ్రౌండ్స్‌లో వార్షికోత్సవాలు నిర్వహించగా.. 2017లో కొంపల్లి వేదికగా ప్లీనరీ నిర్వహించారు. ఆతర్వాత తాజాగా హెచ్‌ఐసీసీ వేదికగా ప్రతిష్ఠాత్మకంగా ప్లీనరీ నిర్వహిస్తుండటం విశేషం.

Related Posts