YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వైసీపీకి ఉక్కు సెగ

వైసీపీకి ఉక్కు సెగ

విశాఖపట్టణం, ఏప్రిల్ 27,
ఉక్కు సెగ వైసీపీని ఉక్కిరి బిక్కిరి చేయనుందా? ఉక్కు సంకల్పం విశాఖపట్నానికే పరిమితం కాకుండా రాష్ట్రం మొత్తం అదే సంకల్పం కనిపిస్తుందా? ఏది ఏమైనా ఉక్కు దెబ్బకు వైసీపీ గింగిరాలు తిరగక తప్పదన్న సంకేతం అయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎన్నికలలో ప్రస్ఫుటంగా కనిపించింది. ఆ ఎన్నికలలో వైసీపీకి చేదు అనుభవం ఎదురైంది. విపక్ష టీడీపీకి తీపి గెలుపు అందింది. నిజానికి ఈ ఎన్నికలలో వైసీపీ అనుబంధ కార్మిక సంస్థ ఐఎన్టీయూసీకి మద్దతు ఇచ్చింది. కేవలం మద్దతే కాదు..ఈ ఎన్నికలలో ఐఎన్టీయూసీ తరఫున...వైసీపీ నేతే పోటీలో దిగి పరాజయం పాలయ్యారు.
అయితే ఈ ఎన్నికలలో వైసీపీ అనుబంధ కార్మిక సంస్థ పోటీ చేయకపోవడానికి కారణం కార్మికులలో వ్యక్తమౌతున్న వ్యతిరేకతే కారణమి పరిశీలకులు అంటున్నారు. మొత్తం మీద వైజాగ్ ఉక్కు కర్మాగారం ఎన్నికల ఫలితం కేవలం ఉక్కు కర్మాగారానికే పరిమితం కాదనీ, అది విశాఖ నగరంలో అధికార పార్టీ వ్యతిరేకతకు అద్దం పడుతున్నదని పరిశీలకులు చెబుతున్నారు. అలాగే కేవలం విశాఖ నగరానికే కాక ఉక్కు జ్వాలలు రాష్ట్ర మంతటా వ్యాపించే అవకాశాలున్నాయని విశ్లేషిస్తున్నారు. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అంటూ తెలుగువాడు నినదించి ఆందోళనలతో రగిలి వందల మంది ప్రాణత్యాగంతో సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని  కేంద్రం ప్రైవేటు పరం చేస్తున్నా ఆపడానికి ఇసుమంతైన ప్రయత్నించని వైసీపీ సర్కార్ పై ఉక్కు కార్మికుల్లోనే కాదు...రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయి. విశాఖ ఉక్కు కేవలం ఒక కర్మాగారం కాదు అది ఆంధ్రుల సెంటిమెంట్. ఆ సెంటిమెంట్ ను వైసీపా పట్టించుకోని ఫలితమే వైజాగ్ స్టీల్ ఎన్నికల్లో ఓటమి.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎన్నికలలో తెలుగుదేశం అనుబంధ యూనియన్ మద్దతు ఇచ్చిన ఐఎన్టీయూసీ దాదాపు 466  ఓట్ల ఆధిక్యంతో గెలిచింది.
ఈ మూడేళ్లలో వైసీపీకి ఏదైనా ఒక ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగలడం ఇదే ప్రథమం అని చెప్పవచ్చు. విశాఖ ఉక్కు సెగ వైసీపీని మరింత ఉక్కిరి బిక్కిరి చేయడం ఖాయమన్నది పరిశీలకుల అంచనా. ఈ అంచనాకూ కారణం లేకపోలేదు.  ఒక కర్మాగారం కార్మిక సంఘం ఎన్నికలే అయినా...ఈ ఎన్నికల ప్రచారం మాత్రం ఒక అ సెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఎన్నిక స్థాయిలో జరిగింది. వైసీపీ  ఎంపీలు, ఎమ్మెల్యేలూ కూడా ప్రచారంలో పాల్గొన్నారు. చివరికి గేట్ మీటింగులకు కూడా హాజరై ప్రచారం నిర్వహించారు. అంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేసినా వైసీపీ తాను మద్దతు పలికిన యూనియన్ ను గెలిపించుకోలేకపోయింది.

Related Posts