YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

టార్గెట్... సిరిసిల్ల...

టార్గెట్... సిరిసిల్ల...

కరీంనగర్, ఏప్రిల్ 27,
రాబోయే ఎన్నికల్లో అధికారం దిశగా అడుగులు వేస్తున్న తెలంగాణ బీజేపీ దూకుడు పెంచింది. బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రలో అధికార పార్టీపై, కేసీఆర్ కుటుంబ రాజకీయంపై టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకత అంశాలను లక్ష్యాంగా చేసుకుని రాజకీయం నడిపిస్తున్నారు. అయితే తాజాగా మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ పార్టీకి చెందిన ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన కౌంటర్ కామెంట్లు ఆసక్తికరంగా మారాయి. ఓ జాతీయ మీడియా సంస్థతో కేటీఆర్ మాట్లాడుతూ నేడు 'దేశంలో జాతీయ పార్టీ అని చెప్పుకునే పార్టీ లేదు. బీజేపీని చూస్తే దక్షిణాదిలో ఒక్క రాష్ట్రంలోనే అధికారంలో ఉంది. ఇక కాంగ్రెస్ ను జాతీయ పార్టీగా పరిగణిస్తే యూపీతో పాటు ఇతర రాష్ట్రాల్లో దాని పరిస్థితి ఏంటో మన అందరికి తెలుసు' అని అన్నారు. ఈ మాటలకు ధర్మపురి అరవింద్ ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. 2019 ఎన్నికల తర్వాతా బీజేపీ అంటే ఏంటో మీ సోదరి కవితకు తెలిసివచ్చిందని త్వరలోనే మీకు కూడా తెలుస్తుందని అన్నారు. 2023లో మీరు సిరిసిల్లాలో ఓటమి ఖాయమని కేటీఆర్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ అయింది.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఇటీవల మంత్రి కేటీఆర్ విమర్శల జోరు పెంచారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలే లక్ష్యంగా మాటల యుద్ధానికి తెర లేపుతున్నారు. ఒక దశలో మోడీని గాడ్సేతో పోల్చిన కేటీఆర్ దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలని సవాలు కూడా విసిరారు. రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ప్రగతి పేరుతో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సెగలు పుట్టిస్తోంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితను ఓడించడం ద్వారా బీజేపీ సంచలనం అయింది. సాధారణంగా కమలం పార్టీ తన ప్రత్యర్థి పార్టీలోని అగ్రనేతలపై టార్గెట్ చేయడం చూస్తూనే ఉన్నాం. గతంలో ఉత్తరప్రదేశ్‌లోని అమేఠీ లోక్‌సభ స్థానంలో పోటీ చేసిన రాహుల్ గాంధీని బీజేపీ ఇక్కడ ఓడించింది. సుధీర్ఘ కాలం గాంధీ కుటుంబానికి పెట్టని కోటగా ఉన్న ఈ స్థానంపై కాషాయ పార్టీ పక్కాగా ప్లాన్ చేసి గెలుపొందింది. ప్రధాన మంత్రి అభ్యర్థి అని ప్రొజెక్ట్ చేయబడ్డ రాహుల్ గాంధీని ఓడించడంతో కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా దెబ్బతీసినట్లైంది. బీజేపీ అదే సీన్ ఇప్పుడు తెలంగాణలో అమలు చేయబోతోందా అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. అధికార టీఆర్ఎస్‌లోని అగ్రనేతల స్థానాల్లో పాగా వేయబోతోందా అనే టాపిక్ చర్చకు వస్తోంది. ఇటీవల ప్రధాని మోడీతో పాటు కేంద్ర ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి కేటీఆర్ సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గంలో 2009 నుండి వరుసగా గెలుపొందుతున్నారు. రాబోయే ఎన్నికల అనంతరం కేటీఆరే నెక్స్ట్ సీఎం అనే ప్రచారం పెద్దఎత్తున జరుగుతోంది. కేసీఆర్ తనయుడిగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీఆర్‌ను ఓడించడమే టార్గెట్‌గా పని చేయబోతోందా అనే అనుమానాలకు తాజాగా బీజేపీ ఎంపీ చేసిన ట్వీట్ ఊతమిచ్చేలా ఉంది.

Related Posts