YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

సఫారీల పై విజృంభించిన టీమిండియా బౌలర్లు..

సఫారీల పై విజృంభించిన  టీమిండియా బౌలర్లు..

 

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరిదైన మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా బౌలర్ల విజృంభణ కొనసాగుతోంది. స్వల్ప విరామాల్లో సఫారీల వికెట్లను నేలకూల్చుతూ ఒత్తిడి తెచ్చే యత్నం చేస్తున్నారు. 125 పరుగులకే ఆరు సఫారీ వికెట్లను సాధించిన భారత జట్టు పట్టు బిగించే పనిలో పడింది. తొలి రోజు ఆటలో మర్‌క్రామ్‌(2) వికెట్‌ను తీసిన భారత్‌.. రెండో రోజు ఆటలో మరింత దూకుడుగా బౌలింగ్‌ చేస్తోంది. ఈ రోజు ఆటలో డీన్‌ ఎల్గర్‌(4), రబడా(30), ఏబీ డివిలియర్స్‌(5), డు ప్లెసిస్‌(8), డీకాక్‌(8)లను పెవిలియన్‌కు పంపింది.

ఏబీ, డు ప్లెసిస్‌ క్లీన్‌బౌల్డ్‌

దక్షిణాఫ్రికా జట్టుకు కీలక ఆటగాళ్లైన ఏబీ డివిలియర్స్‌, డు ప్లెసిస్‌లు క్లీన్‌ బౌల్డ్‌గా పెవిలియన్‌ చేరారు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో భాగంగా భువనేశ్వర్‌ వేసిన 37 ఓవర్‌ నాల్గో బంతికి ఏబీ క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. భువీ వేసిన బంతిని అంచనా వేయడంలో విఫలమైన ఏబీ వికెట్‌ను సమర్పించుకున్నాడు. ఆపై బూమ్రా వేసిన 42 ఓవర్‌ నాల్గో బంతికి డు ప్లెసిస్‌ కూడా క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. బూమ్రా సంధించిన ఇన్‌స్వింగర్‌ను విడిచిపెట్టే యత్నంలో డు ప్లెసిస్‌ బౌల్డ్‌ అయ్యాడు. దాంతో 15 పరుగుల వ్యవధిలో సఫారీలు రెండు కీలక వికెట్లను నష్టాపోయారు. టీమిండియా సాధించిన ఆరు వికెట్లలో భువనేశ్వర్‌ కుమార్‌ మూడు వికెట్లు సాధించగా, బూమ్రా రెండు వికెట్లు తీశాడు. ఇషాంత్‌కు వికెట్‌ దక్కింది.

6/1 ఓవర్‌నైట్‌ స్కోరుతో  తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన కాసేపటికే డీన్‌ ఎల్గర్‌ వికెట్‌ను సఫారీలు కోల్పోయారు. ఆ దశలో మరో ఓవర్‌ నైట్‌ ఆటగాడు రబడాకు జత కలిసిన ఆమ్లా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు.ఈ క‍్రమంలోనే వీరిద్దరూ 64 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేశారు.  కాగా, సఫారీలు ఇన్నింగ్స్‌ లో భాగంగా ఇషాంత్‌ శర్మ వేసిన 30వ ఓవర్‌ ఆఖరి బంతికి రహానేకు క్యాచ్‌ ఇచ్చిన రబడా మూడో వికెట్‌గా అవుటయ్యాడు. ఆపై దక్షిణాఫ్రికా వరుసగా ప్రధాన వికెట్లను కోల్పో‍యి కష్టాల్లో పడిం

Related Posts