
విజయవాడ నగర శివారు వాంబేకాలనిలో ఏ బ్లాక్ సమీపంలో ఒక రౌడీషీటర్ గురువారం వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో భార్య పిల్లలపై విచక్షణా రహితంగా దాడి చేసాడు. దీన్ని గమనించిన స్థానికులు రౌడీషీటర్ కు దేహశుద్ధి చేసారు. గోనే బస్తాలో బంధించి పోలీసులకు అప్పగించారు. వాంబేకాలనీలో నివాసముంటున్న కరెంటు ప్రసాద్ అనే రౌడీషీటర్ గత కొన్ని ఏళ్ళుగా చెడు వ్యసనాలకు బానిసై భార్య, పిల్లకు దూరంగా ఉంటున్నాడు. గురువారం మధ్యాహ్నం ఫూటుగా మధ్యం సేవించి ఇంట్లొ ఉన్న భార్యపిల్లలపై దాడీకి దిగాడు. చుట్టుప్రక్కల వాళ్ళు అక్కడి చేరుకొని అతనిని గోనే సంచిలో బంధించి పోలీసులకు అప్పగించారు.