
సూర్యాపేట
ఆత్మకూరు (ఎస్) మండలం తుమ్మల పెన్ పహడ్ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. భూమిని పంచివ్వలేదన్న కారణంతో కోపం పెంచుకున్న ఇద్దరు కొడుకులు మానవత్వాన్ని మంట కలుపుతూ కన్నతండ్రిని కర్కశంగా నరికి చంపన ఘటన గ్రామంలో కలకలం సృష్టించింది. తుమ్మల పెన్ పహాడ్ గ్రామనికి చెందిన ఎరగాని శ్రీను గౌడ్ (50)కి కొంత వ్యవసాయ భూమి ఉంది. గత కొంత కాలంగా శ్రీను ఇద్దరు కొడుకులు సంతు, రాజశేఖర్ లు ఆ భూమిని పంచి ఇవ్వాలని తండ్రితో గొడవలు పడేవారు. ఎన్నిసార్లు అడిగినా భూమి పంచి ఇవ్వకపోవడంతో గురువారం ఉదయం ఇద్దరు కొడుకులుతండ్రి శ్రీనుపై గొడ్డలి, కత్తితో దాడి చేసి, అతి దారుణంగా హత్య చేశారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని, సంఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.