YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

చొరబాటుదారులకు సహకరిస్తే రూ.2 కోట్ల జరిమానా? 15 ఏళ్ల జైలు!

చొరబాటుదారులకు సహకరిస్తే రూ.2 కోట్ల జరిమానా? 15 ఏళ్ల జైలు!

న్యూ ఢిల్లీ మే 12
గల్ఫ్ దేశాల్లో చాలా కఠినమైన చట్టాలుంటాయి. వాటిని ఉల్లంఘిస్తే శిక్షలు ఘోరంగా ఉంటాయి. అనాది నుంచి వారు అలానే మెయింటేన్ చేస్తున్నారు.  ముఖ్యంగా చొరబాటు దారులపై ఉక్కుపాదం మోపుతారు. చొరబాటుదారులను దేశంలోకి ఆహ్వానిస్తే తీవ్రంగా పరిగణిస్తామని ఈ సందర్భంగా ఆ దేశ పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరించింది. అలాంటి వారిపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపింది.చొరబాటుదారులకు సహకరించినట్లు నిర్ధారణ అయితే దోషులకు 1 మిలియన్ సౌదీ రియాల్స్ (రూ.2.06 కోట్లు) జరిమానాతోపాటు 5 నుంచి 15 ఏళ్ల వరకూ జైలు శిక్ష ఉంటుందని ప్రాసిక్యూషన్ స్పష్టం చేసింది.అలాగే చొరబాటుదారులకు ఆశ్రయం కల్పించిన ఇంటిని కూడా జప్తు చేస్తామని సౌదీ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు సంబంధించి జరిమానాల విషయమై ఈ ఫైన్ విధిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.ఇక పక్కనున్న కువైట్ దేశం కూడా వలసదారుల విషయంలో అప్పట్లో కఠిన చట్టాలు చేసింది. కువైట్ ప్రభుత్వం కొత్తగా పెట్టిన వీసా నిబంధనలు అక్కడ నివసించే వలసదారుల పాలిట శాపంగా మారాయి. కువైట్ లో నివసించే వలసదారుల పిల్లలు 12 ఏళ్లు దాటితే అక్కడ డిపెండెంట్ వీసా కోసం దరఖాస్తు చేసుకునే అర్హత కోల్పోతారు. ఇక 18 ఏళ్లు దాటిన వారు పిల్లలు కూడా అక్కడ  యూనివర్సిటీల్లో విద్యనభ్యసిస్తూనే వీసా ఇస్తారు. లేదంటే దేశం నుంచి వెళ్లగొడుతారు.ఇక సంపన్న దేశం దుబాయ్ లోనూ ఈ ఆంక్షలు తక్కువ. దీంతో బతుకుదెరువు కోసం  భారతీయులు ఎక్కువగా ఇక్కడికే వెళతారు.   వీరు కుటుంబాన్ని కువైట్ తీసుకెళ్లాంటే అతడికి 12 ఏళ్లు దాటిన కుమారుడు ఉంటే ప్రస్తుత కువైట్ వీసా నిబంధనల ప్రకారం అతడు తల్లిదండ్రులతో ఉండడానికి వీలు పడదు. 12 ఏళ్లు దాటిన విదేశీ పిల్లలకు డిపెండెంట్ వీసా రాదు. ఇక 18 ఏళ్లు దాటిన విదేశీయుల పిల్లలు అక్కడి చదివితేనే డిపెండెంట్ వీసా ఇస్తారు. చదవకపోతే తల్లిదండ్రులతో కలిసి ఉండడానికి వీల్లేదన్నమాట..
ఇప్పటికే గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాల కోత వలసవీసా నిబంధనలు కఠినం చేయడంతో చాలా మంది భారతీయులు   స్వదేశానికి తిరిగివచ్చేస్తున్నారు. ఇప్పుడు వలసవాదుల పిల్లలు ఉండడానికి వీల్లేకుండా నిబంధనలు పెట్టడంతో అక్కడ పనిచేసేవ వారు వారు కుటుంబాలతో ఉండలేని పరిస్థితి ఏర్పడుతోంది.

Related Posts