YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏబీవీ నెక్స్ట్ ఏంటీ..

ఏబీవీ నెక్స్ట్ ఏంటీ..

విజయవాడ, మే 13,
ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇచ్చే ఉద్దేశం జగన్ సర్కార్ కు లేదని వరసగా జరుగుతున్న సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి. ఏబీవీకి పోస్టింగ్ ఇవ్వకుండా ఉండటం కోసం జగన్ సర్కార్ ఏకంగా సుప్రీం తీర్పును కూడా ఉల్లంఘించి పర్యవసానాలను ఎదుర్కొనడానికి సిద్ధపడినట్లు కనిపిస్తున్నది. తన నిర్ణయాలను తప్పుపడితే కోర్టులపై కూడా విమర్శలు గుప్పించి, జడ్జీలకు ఉద్దేశాలను ఆపాదించడం జగన్ సర్కార్ కు ఒక అలవాటుగా మారింది. ఈ విషయంలో న్యాయస్థానాలు ఎన్నిసార్లు అక్షింతలు వేసినా జగన్ సర్కార్ తీరు మారడం లేదు. ఇప్పుడు ఏబీ వెంకటేశ్వరరావు విషయంలో కూడా ఏపీ సర్కార్ నేరుగా సుప్రీం కోర్టు ఆదేశాలనే బేఖాతరు చేసే దిశగా అడుగులు వేస్తున్నది.   సీనియర్ ఐపీఎస్   ఏబీవీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ముగిసిందని ఆయనకు తక్షణం పోస్టింగ్ ఇవ్వాలని సుప్రీంకోర్టు  విస్పష్ట ఆదేశాలిచ్చి రెండు వారాలు గడిచినా, ఇంత వరకూ ప్రభుత్వం ఆ ఆదేశాల అమలుకు ఎటువంటి చర్యలూ తీసుకోలేదు.పైపెచ్చు తనకు పోస్టింగ్ ఇవ్వాలంటూ సీఎస్ ను కలిసిన వెంటకేశ్వరరావుకు అవమానమే ఎదురైంది. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఓ సారి చీఫ్ సెక్రటరీని కలిసి సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చయాలని కోరిన ఏబీవీకి ప్రాసెల్ లో పెడతామన్న సమాధానం వచ్చింది.  అయితే  ఆ తరువాత  తర్వాత సివిల్ సర్వీస్ అధికారుల బదిలీలు జరిగినప్పుడు  కనీసం సర్వీసులోకి తీసుకున్నట్లుగా  ఆదేశాలు రాలేదు  తనకు పోస్టింగ్ ఇవ్వాలని అడిగేందుకు మరోసారి ఆయన  సచివాలయానికి వెళ్లారు. సీఎస్ అందుబాటులో లేకపోవడంతో, మరోసారి బుధవార వెళ్లారు. అయతే ఈ సారి అవమానకరంగా ఆయనను వెయిటింగ్ రూములో ఉంచి సీఎస్ బయటకు వెళ్లిపోయారు.  గత ప్రభుత్వంలో ఇంటలిజెన్స్ చీఫ్‌గా పని చేసిన ఏబీవీపై కక్షసాధింపులో భాగంగానే సర్కార్ ఇలా వ్యవహరిస్తున్నదన ఆరోపణలున్నాయి.  వైసీపీ అధికారం చేపట్టగానే ఆయనపై కేసులు పెట్టి సస్పెండ్ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశించినా ఆయనకు పోస్టింగ్ ఇవ్వడానికి జగన్ సర్కార్ ససేమిరా అన్నట్లుగా వ్యవహరిస్తున్నది.  సర్కార్ తీరు సివిల్  సర్వీస్ అధికారులలో ఆందోళన రేకెత్తిస్తున్నది. ఏపీ హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించిన కారణంతో దాదాపు పది మంది అధికారులు శిక్షకు గురైన సంగతి తెలిసిందే. తొలుత జైలు శిక్ష విధించిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆ తరువాత అధికారుల విజ్ణప్తిపై ఆ శిక్షను సామాజిక సేవా శిక్షగా మార్చింది. ఇప్పుడు  సుప్రీం ఆదేశాల ఉల్లంఘన పై సీఎస్ ఎటువంటి పరిణామాలు ఎదుర్కొన వలసి వస్తుందోనన్న చర్చ అధికారులలో జరుగుతోంది.  ప్రభుత్వ తప్పిదాలకు సివిల్ సర్వీసెస్ అధికారులు శిక్షలకు గురి కావడం ఇప్పుడు ఏపీలో సర్వసాధారణ విషయంగా మారిపోయింది.

Related Posts