YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

చిత్తూరు కోర్టులో పిటిషన్ వేసిన ప్రభుత్వం

చిత్తూరు కోర్టులో పిటిషన్ వేసిన ప్రభుత్వం

తిరుపతి, మే 13,
పదో తరగతి పేపర్ లీకేజ్‌ వ్యవహారంలో మాజీ మంత్రి నారాయణ బెయిల్‌ రద్దుపై చిత్తూరు కోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. శుక్రవారం ప్రభుత్వం తరపున అడిషనల్‌ ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ఈ పిటిషన్‌ ఫైల్ చేశారు. టెన్త్‌ క్లాస్‌ పేపర్‌ లీకేజీ వ్యవహారంలో నారాయణ కుట్ర ఉందని.. బెయిల్‌ రద్దు చేయాలని కోరారు. దీనిపై కోర్టులో విచారణ జరిగింది. అడిషనల్‌ ఏజీ పొన్నవోలు వాదనలు వినిపించారు. చిత్తూరు కోర్టు నారాయణకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 24న కేసుపై వాదనలు జరగనున్నాయి. ఈ నెల 10న పదో తరగతి ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహారంలో నారాయణ అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షలు నిర్వహించి.. ఆయన్ను 11 తెల్లవారుజామున నారాయణను చిత్తూరు నాలుగో అదనపు జడ్జి ముందు హాజరు పరిచారు. ఆ విద్యా సంస్థలతో నారాయణకు ప్రస్తుతం సంబంధం లేదని.. 2014లోనే విద్యా సంస్థల చైర్మన్ పదవికి రాజీనామా చేశారని ఆయన తరఫున లాయర్లు వాదనలు వినిపించారు. దీనికి సంబంధించిన డాక్యుమెంట్లను జడ్జికి అందజేశారు.నారాయణ తరఫు లాయర్ల వాదనలతో ఏకీభవించిన జడ్జి నారాయణకు బెయిల్ మంజూరు చేశారు. అలాగే రూ. లక్ష చొప్పున ఇద్దరు జామీను ఇవ్వాలని సూచించారు. ఇప్పుడు ప్రభుత్వం బెయిల్ రద్దు కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ నెల 24న చిత్తూరు కోర్టులో వాదనలు జరగనుండటంతో ఆసక్తికరంగా మారింది. నారాయణ బెయిల్ రద్దవుతుందా.. కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనే ఉత్కంఠ మొదలైంది.

Related Posts