YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కేసీఆర్‌ అ ఒక్క విష‌యంలో మాత్రం మోదీని ఫాలో అవుతున్నారు..!

కేసీఆర్‌ అ ఒక్క విష‌యంలో మాత్రం మోదీని ఫాలో అవుతున్నారు..!

న్యూఢిల్లీ మే 13,
సీఎం కేసీఆర్ అ ఒక్క విష‌యంలో మాత్రం ప్రధాని నరేంద్ర మోదీని తూచా త‌ప్ప‌కుండా ఫాలో అవుతున్నారు. ప్ర‌తిరోజు మోదీ  (Modi)పై విమ‌ర్శ‌లు, తీవ్ర అరోప‌ణ‌లు చేస్తున్న టీఅర్ఎస్ (TRS) పార్టీ అధినేత అయ‌న్నే ఫాలో అవడం ఎంట‌ని అనుకుంటున్నారా..  ముల్లును ముల్లుతోనే తీయాల‌ని భావిస్తున్న‌ట్లున్నారు. అందుకే మోదీ పాత ఫార్ములాకే ప‌దును పెడుతున్నారు. జాతీయ రాజ‌కీయాల వైపు స్పీడ్ పెంచిన కేసీఅర్. రాష్ట్ర వ్య‌వ‌హ‌రాల కంటే దేశ రాజ‌కీయాల‌పైనే ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టారు. గ‌త ప‌ది రోజులుగా ఫాం హౌస్‌కే ప‌రిమిత‌మైన అయ‌న పార్టీ ముఖ్యుల‌తో సీరియ‌స్‌గా చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. రెండు రోజుల పాటు సినీ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ కూడా ఫాం హౌస్‌లోనే గ‌డిపారు. దేశంలోని ప్ర‌ముఖ రాజ‌కీయ నేత‌లు, బిజెపి వ్య‌తిరేఖ శ‌క్తుల‌తో కేసీఆర్కె మంత‌నాలు జ‌రుపుతున్న‌ట్లు తెలుస్తుంది. ఒక‌టి రెండు రోజుల్లో వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్ కూడా ఫాంహౌస్‌కి వ‌చ్చి కేసీఅర్‌తో భేటి అవ‌నున్న‌ట్లు స‌మాచారం. అయితే దేశ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పేందుకు కేసీఆర్ మోదీ స్టైల్‌నే ఫాలో అవుతున్నారు. మోదీ కూడా 2014 ముందు వ‌ర‌కు గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. గుజ‌రాత్ అభివృద్దిని పెద్ద ఎత్తున ప్ర‌చారం చేశారు.అన్ని రాష్ట్రాల్లోను అప్ప‌ట్లో గుజ‌రాత్ ప‌థ‌కాలు, అభివృద్ది కార్య‌క్ర‌మాల ప్ర‌క‌ట‌న‌లు పెద్ద ఎత్తున ప‌త్రిక‌ల్లో టివిల్లో వ‌స్తుండేవి. సోష‌ల్ మీడియాలోను గుజ‌రాత్ మెడ‌ల్‌పై ప్రచారం చేయించారు మోది. అప్పుడు మోదీకి వ్యూహ‌క‌ర్త‌గా ఉన్న‌ది కూడా ప్ర‌శాంత్ కిశోర్‌. ముఖ్యమంత్రిగా మున్న మోదీ కూడా అప్ప‌టి ప్ర‌ధానిపై, కేంద్ర ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఫెడ‌ర‌ల్ వ్య‌వ‌స్థ‌పై ప్ర‌శ్న‌లు కురిపించారు. అనేక స‌మావేశాలు, జాతీయ స్థాయి చ‌ర్చా వేదిక‌ల‌ను గుజ‌రాత్‌తో నిర్వ‌హించారు మోదీ. సేమ్ టు సేమ్ ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు కేసీఆర్.జాతీయ రాజ‌కీయాల‌వైపు వెళ్ళాల‌నే అలోచ‌న వ‌చ్చిన‌ప్ప‌టినుంచి తెలంగాణ‌లో అమ‌ల‌వుతున్న ప‌థ‌కాల‌ను పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తుంది టీఆర్ఎస్ పార్టీ. వివిధ రాష్ట్రాల్లో తెలంగాణ స్కీంల యాడ్స్ క‌నిపిస్తున్నాయి. జాతీయ మీడియాలోను ప్ర‌క‌ట‌న‌లు మెద‌లుపెట్టారు. ఇప్పుడు కూడా కేసీఆర్ కు వ్యూహ‌క‌ర్త‌గా ప్ర‌శాంత్‌కిశోర్ ప‌నిచేస్తున్నారు. రిటైర్ట్ లివిల్ స‌ర్వెంట్స్‌తో హైద‌రాబాద్‌లో స‌మావేశం ఏర్పాటు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. తెలంగాణ అభివృద్ది దేశమంతా జ‌ర‌గాల‌ని డిమాండ్ చేస్తుంది టీఅర్ఎస్‌. ఎలాగైతే గుజ‌రాత్ మెడ‌ల్‌తో ఢిల్లి పీఠం ఎక్కారో… అదే విధంగా తెలంగాణ మెడ‌ల్‌తో కేసీఅర్ ప్ర‌య‌త్నాలుచేస్తున్నారు. జాతీయ స్థాయిలో వివిధ భాష‌ల్లో తెలంగాణ అభివృద్ది, ప‌థ‌కాల‌పై ప్ర‌త్యేకంగా విడియోలు త‌యారుచేయిస్తుంది టీఅర్ఎస్ పార్టీ. దీనికి ప్ర‌కాశ రాజ్ వాయిస్ ఒవ‌ర్ ఇస్తున్న‌ట్లు తెలుస్తుంది.

Related Posts