YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

అన్ని కార్పోరేట్ హాస్పిటల్లలో క్యాష్ లెస్ ట్రీట్మెంట్ కల్పించాలి

అన్ని కార్పోరేట్ హాస్పిటల్లలో క్యాష్  లెస్ ట్రీట్మెంట్ కల్పించాలి

హైదరాబాద్ మే 16;  తెలంగాణ ఉద్యోగుల సంఘం అత్యవసర సమావేశం గౌరవాద్యక్షుడు  ఏ.పద్మాచారి అద్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఈ క్రింది తెలియపర్చిన తీర్మానాలను ఆమోదించింది.ప్రభుత్వ దశలవారిగా ఉద్యోగ ప్రకటనలు విడుదల చేసినందునకు తెలంగాణ ఉద్యోగుల సంఘం, ముఖ్యమంత్ర కె. చంద్రశేఖర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా ఏదైన ఉద్యోగానికి సెలెక్టయిన వ్యక్తి ఉద్యోగంలో చేరని సందర్భంలో ఆ ఖాళీలో సీనియార్టి ప్రకారం తర్వాత వ్యక్తులతో నియమించాలని,వేతన సవరణ సిఫార్సుల మేరకు ఉద్యోగుల యొక్క బెసిక్ పేలో 1 శాతాన్ని సమానముగా వైద్య ఖర్చులకు సంబంధించి తమ వంతుగా ఇవ్వడానికి ఉద్యోగ సంఘం తమ సమ్మతిని తెలియజేసింది. మిగిలిన 3 శాతాన్ని ప్రభుత్వం వాటా క్రింద విడుదల చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అదే విధంగా అన్ని కార్పోరేట్ హాస్పిటల్లలో క్యాష్  లెస్ ట్రీట్మెంట్ కల్పించాలని కోరింది. ఉద్యోగులకు పెన్నవర్లకు సంబందించిన జీతాలు సరెండర్ మెడికల్ బిల్లులు / జి.పి.ఎఫ్ తదితర బిల్లులను ఫైనాన్స్ డిపార్లు నుండి తీసివేసి పాత పద్ధతిలో పి.ఎ.పి., డి.టి.ఎస్.టి.ఓ) బిల్లు పాస్ చేసిన వెంబడి వారి వారి భాతాలో జము  చేయాలని, అందుకు  తగిన చర్య తీసుకొవాలని కోరింది.కాంట్రాక్ట్స్ విధానంలో పనిచేస్తున్న వారి సర్వీసును వీలైనంత తొందరగా క్రమ బద్ధీకరించాలని,కోర్టు ఉత్తర్వుల మేరకు సమాన పనికి సమాన వేతనమును అమలు పరుచాలని కోరింది.ముఖ్యమంత్రి ఆదేశించిన విధంగా కారుణ్య నియామాకాలను పరిగణించి ఇప్పటి వరకు వేచి ఉన్న వారికి వెంటనే నియమాకాలు జరిపి పోస్టింగ్ ఉత్తర్వులను ఇవ్వవలసినదిగా,  సమావేశం కోరింది.కోరడమైనది.సచివాలయంలో సర్వీసు సెక్రటరీ పోస్టు ఖాళీ ఉన్నందు వలన ఉద్యోగుల సమస్యలు పరిష్కారంలో జాప్యం జరుగుతున్నది. కావున సర్వీసు సెక్రటరీ పోస్టును వెంటనే భర్తీ కోరింది.ఆంధ్రప్రదేశ్ సచివాలయం నుండి తెలంగాణకు బదిలీపై వచ్చిన తెలంగాణ (క్లాస్ 3 మరియు క్లాస్ 4) ఉద్యోగులను అతి త్వరగా సచివాలయంలో సర్దుబాటు చేయాలని, కావలసిన ఖాళీలు లేని సందర్భంలో సూఫర్ న్యూమరం పోస్టులను మంజూరుచేసి వారిని సచివాలయా పోస్టింగ్ ఇవ్వలని ప్రభుత్వాన్ని కోరుతూ సమావేశం తీర్మానించింది.ఈ సమావేశమ్ లో సంఘం అధ్యక్షులు యం. రవీందర్ కుమార్, ప్రధాన కార్యదర్శి సి. హరీష్ కుమార్ రెడ్డి, ప్రధాన సలహాదారుడు పి. శ్రీవన్ కుమార్ గౌడ్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు ఎస్. నర్సింగ్ రావు కిష్టమూర్తి . డా॥ పి.శేఖర్, డా॥ షరీఫ్ అసోసియెట్ ప్రసిడెంట్, పి. పరమేష్,ఉపాధ్యక్షులు గ్రేటర్ హైదరాబాద్ మహేష్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts