YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

పాకిస్తాన్‌ను అమెరికా బానిస‌గా మార్చేసింది

పాకిస్తాన్‌ను అమెరికా బానిస‌గా మార్చేసింది

న్యూ డిల్లీ మే 16
పాక్ మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ మ‌రోసారి అమెరికాపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పాకిస్తాన్‌ను అమెరికా బానిస‌గా మార్చేసింద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆక్ర‌మించుకోకుండానే పాక్‌ను అమెరికా బానిస‌గా మార్చేసుకుందంటూ మండిప‌డ్డారు. వ‌ల‌సవాద ప్ర‌భుత్వాన్ని పాక్ ప్ర‌జ‌లు ఎన్న‌డూ అంగీక‌రించ‌ర‌ని పున‌రుద్థాటించారు. ఫైస‌లాబాద్‌లో జ‌రిగిన ఓ బ‌హిరంగ స‌భ‌లో మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. అమెరికా స్వావ‌లంబ‌న క‌లిగిన దేశ‌మ‌ని, అయినా… లాభం లేనిదే ఇత‌ర దేశాల‌కు ఒక్క రూపాయి కూడా సాయం చేయ‌ద‌ని ఇమ్రాన్ దుమ్మెత్తిపోశారు. పాక్ విదేశాంగ మంత్రి బిలావ‌ల్ భుట్టో అమెరికా ప‌ర్య‌ట‌న‌కు వెళ్తున్నార‌ని, అక్క‌డ డ‌బ్బులు యాచిస్తారంటూ ఇమ్రాన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎన్నిక‌లు జ‌రిగితే… అధికారంలోకి రాలేమన్న విష‌యం వారికి బోధ‌ప‌డింద‌న్నారు. మంత్రి బిలావ‌ల్ భుట్టో, ఆయ‌న తండ్రి ఆసిఫ్ అలీ ఇద్ద‌రూ అవినీతిప‌రుల‌ని, ప్ర‌పంచంలో కొన్ని చోట్ల ఈ అక్ర‌మ సంపాద‌న‌ను దాచేశార‌ని ఇమ్రాన్ ఆరోపించారు. అమెరికా విదేశాంగ మంత్రి బ్లింక‌న్‌కు వారెక్క‌డ దాచారో తెలుస‌ని, అందుకే బిలావ‌ల్ వారిపై ఎక్కువ ఒత్తిడి చేయ‌ర‌ని ఇమ్రాన్ ఆరోపించారు.

Related Posts