
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగిని ఆత్మహత్య ఘటన కలకలం రేపింది. ఆళ్లగడ్డ స్త్రీ శిశు సంక్షేమ శాఖలో సూపర్ వైజర్ గా పని చేస్తున్న శోభా రాణి శుక్రవారం ఉదయం కలెక్టర్ కార్యాలయం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. డీఆర్సీ సమావేశంకోసం కర్నూలుకు వచ్చిన శోభారాణి మీటింగ్ జరుగుతుండగానుఏ మెడపైకి వెళ్లి క్రిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే, ఆమె ఆత్మహత్య కు అధికారుల వేధింపులే కారణమని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం నిర్వహించిన ర్యాలీకి హాజరు కాకపోవడంతో శోభా రాణికి ఐసిడిఎస్ పిడి మెమో జారీ చేసారు. తరచుగా మెమోలు జారీ చేస్తూ వేధింపులకు గురి చేస్తుండటంతో మనస్తాపం చెంది ఉంటుందని బంధువులు అంటున్నారు. ఆళ్లగడ్డ మండలం బత్తలూరు లో విధులు నిర్వహిస్తున్న శోభా రాణి కి భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం తరలించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కలెక్టర్ ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.