YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో బాంబు కలకలం..

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో బాంబు కలకలం..

- అది గ్రేనెడ్ కాదు...భద్రతా సిబ్బంది.

ఢిల్లీ ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్ట్‌లో గ్రేనెడ్ లాంటి వస్తువు కలకలం రేపింది. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు గురువారం గో ఎయిర్ ఫ్లైట్‌లో వెళ్తున్న ఓ ప్రయాణికుడి లగేజ్‌లో సెక్యూరిటీ చెకింగ్ చేస్తుండగా హ్యాండ్ గ్రేనెడ్ బయటపడింది. దీంతో ఆ ప్రయాణికుడిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకుంది. నిజానికీ అది గ్రేనెడ్ బాంబు కాదట.

హ్యాండ్ గ్రేనెడ్ ఆకారంలో ఉన్న పవర్ బ్యాంకట. ఈ విషయం కాస్త విచారణలో తేలడంతో అధికారులంతా అవాక్కయ్యారు. చివరికి అది గ్రేనెడ్ కాదు.. పవర్ బ్యాంక్ అని నిర్ధారించిన భద్రతా సిబ్బంది చివరికి ఆ ప్రయాణికుడిని విమానంలో ప్రయాణించేందుకు అనుమతించినట్టు గో ఎయిర్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. 

Related Posts