YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

ప్రదర్శనను నిలిపేసే ప్రసక్తే లేదు..

 ప్రదర్శనను నిలిపేసే ప్రసక్తే లేదు..

- కర్ణిసేన హెచ్చరికలకు బెదిరేది లేదు..

పద్మావత్ సినిమా ప్రదర్శనను నిలిపేయాలన్న కర్ణిసేన హెచ్చరికలకు బెదిరేది లేదని నావల్టీ సినిమాస్ థియేటర్ పేర్కొంది. గతంలో గాంధీ చిత్ర ప్రదర్శన జరుగుతుండగా ఆందోళనకారులలో ఒకరు హాలు ఆవరణలో చిన్నపాటి బాంబును పేల్చాడని నిర్వాహకులు గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో జరిగిన ఆందోళనల నేపథ్యంలో సినిమా ప్రదర్శనను నిలిసేస్తామని అంతా భావించినా తాము ఆపలేదని వివరించారు. హాలుపై బాంబు దాడి చేసిన వ్యక్తి ఆ తర్వాత దొరికాడు.. అయితే, బాంబు పేలుడు జరిగిన తర్వాత కూడా మేం ప్రదర్శనను నిలిపేయలేదు. ఇప్పుడు పద్మావతి విషయంలోనూ అంతే! హాల్‌లో ప్రదర్శనను నిలిపేసే ప్రసక్తే లేదని నావల్టీ సినిమాస్ నిర్వాహకులు స్పష్టం చేశారు.

Related Posts