YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

వెబ్‌ బ్రౌజర్‌ ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌ (ఐఈ) బుధవారం నుంచి బంద్

వెబ్‌ బ్రౌజర్‌ ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌ (ఐఈ) బుధవారం నుంచి బంద్

వాషింగ్టన్‌, జూన్‌ 13
27 ఏండ్లపాటు నిరంతరాయంగా ఇంటర్నెట్‌ సేవలను అందించిన వెబ్‌ బ్రౌజర్‌ ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌ (ఐఈ) బుధవారం నుంచి పనిచేయబోదు. విండోస్‌ 10 తదితర వెర్షన్లలో ఐఈ డెస్క్‌టాప్‌ యాప్‌ సేవలు జూన్‌ 15 నుంచి నిలిచిపోనున్నట్టు మైక్రోసాఫ్ట్‌ వెల్లడించింది. ఈ వెర్షన్‌ను వినియోగించే యూజర్లు ‘మైక్రోసాఫ్ట్‌ ఎడ్జ్‌ (ఎంఈ)’కు మారాలని సూచించింది. అత్యాధునిక వెబ్‌సైట్లు, యాప్స్‌ సేవలను అత్యంత వేగంగా, వినూత్నంగా అందించేందుకు ‘మైక్రోసాఫ్ట్‌ ఎడ్జ్‌’ చక్కని వేదిక అని పేర్కొంది. జూన్‌ 15న ఐఈ సేవలను నిలిపివేస్తున్నట్టు గత ఏడాది మేలోనే మైక్రోసాఫ్ట్‌ ప్రకటించింది. కాగా ఐఈ సేవలు నిలిచిపోతుండటంతో 1990 దశకంలో జన్మించిన వాళ్లు ఐఈ సేవలను గుర్తుచేసుకుంటూ వీడ్కోలు సందేశాలు పోస్ట్‌ చేస్తున్నారు.
ప్రస్థానం ముగిసింది ఇలా..
1995లో విండోస్‌ 95తో పాటే ఐఈని మైక్రోసాఫ్ట్‌ తీసుకొచ్చింది. 2002-03లో మొత్తం వెబ్‌ బ్రౌజింగ్‌ మార్కెట్‌లో 95 శాతం వాటాను ఐఈ చేజిక్కించుకొన్నది. అనంతరం వెబ్‌ బ్రౌజింగ్‌ ప్లాట్‌ఫాంలు ఫైర్‌ఫాక్స్‌, క్రోమ్‌లు వాడుకలోకి వచ్చాయి. ఫీచర్లు, అప్లికేషన్లు, వేగంలో వాటితో ఐఈ పోటీలో నిలబడలేకపోయింది. దీంతో ఐఈని ఒక డీఫాల్ట్‌ బ్రౌజర్‌గా యూజర్లు పరిగణించడం మొదలుపెట్టారు. ఇతర బ్రౌజర్లను ఇన్‌స్టాల్‌ చేసుకోవడానికే దీన్ని వినియోగించడం మొదలుపెట్టారు. యూజర్ల సంఖ్య లక్షలకు పడిపోయింది. ఇది గమనించిన మైక్రోసాఫ్ట్‌ 2016 తర్వాత ఐఈలో కొత్త ఫీచర్లను తీసుకురావడాన్ని కూడా నిలిపేసింది. చివరగా ఐఈని నిలిపేస్తున్నట్టు ప్రకటించింది.

Related Posts