YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఎమ్మెల్యేల పనితీరును ఐప్యాక్ బృందం సర్వేలు

ఎమ్మెల్యేల పనితీరును ఐప్యాక్ బృందం సర్వేలు

హైదరాబాద్, జూన్ 22,
ఎమ్మెల్యేలు నియోజకవర్గాలపై దృష్టిసారించారు. పెండింగ్ పనుల పూర్తికి చర్యలు చేపట్టడంతో పాటు ఐప్యాక్ సర్వేల్లో సానుకూలంగా వచ్చేలా ముమ్మర యత్నాలు ప్రారంభించారు. నమ్మకస్తులకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు గ్రామానికో ఇన్‌చార్జీని నియమించి ఎప్పటికప్పుడు గ్రౌండ్ రిపోర్టను తెప్పించుకుంటున్నారు. నేతలతో రివ్యూలు చేపడుతూనే ఏ గ్రామంలో వ్యతిరేకత ఉందో ఆ గ్రామంపై దృష్టిసారిస్తున్నారు. వ్యతిరేకత రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సర్వేల్లోనూ, అధిష్టానం వద్ద మంచిపేరు తెచ్చుకునేలా ప్రయత్నాలను ముమ్మరం చేశారు ఎమ్మెల్యేలు.ఎమ్మెల్యేల పనితీరుపై ఐప్యాక్‌తో పాటు పలు సంస్థలు సర్వేలను ముమ్మరం చేయడం, కొంత మంది ఎమ్మెల్యేల పనితీరు ఆశించిన స్థాయిలో లేదని ప్రభుత్వానికి నివేదిక అందింది. ఆ సర్వే ప్రకారమే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఇస్తామని, సిట్టింగ్‌లకు వస్తాయనే నమ్మకం పెంచుకోవద్దని పనితీరుతోనే టికెట్లు ఇస్తామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ మధ్య ఖమ్మంలో జరిగిన సభలో స్పష్టం చేశారు. దీంతో ఎమ్మెల్యేలంతా నియోజకవర్గాలపై దృష్టిసారించారు. రాబోయే ఎన్నికల్లో టికెట్ తిరిగి తెచ్చుకోవాలని యత్నాలను ముమ్మరం చేశారు. అందులో భాగంగానే స్థానిక నేతలతో రివ్యూలు నిర్వహిస్తున్నారు. ఏ గ్రామంలో టీఆర్ఎస్ పై ప్రజల్లో అభిప్రాయం ఏముందనే వివరాలను ఆరాతీస్తున్నారు. పెండింగ్ పనులు ఎన్ని ఉన్నాయి... సంక్షేమ పథకాలు అర్హులకు అందుతున్నాయా? లేదా? అని సవివరంగా తెలుసుకుంటున్నారు. వాటిని పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ప్రజల్లోని అసమ్మతికి చెక్ పెట్టేలా అభివృద్ధిపై దృష్టిసారించారు.నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పార్టీ పరిస్థితి, నేతల తీరుపై ఎమ్మెల్యేలు ఆరా తీస్తున్నారు. ఎప్పటికప్పుడు నివేదికలు తెచ్చుకునేందుకు నమ్మకస్తులను గ్రామాల్లో పెద్దపీట వేస్తున్నారు. ఇప్పటికే అన్ని గ్రామాల్లో పార్టీ అధ్యక్షులు ఉన్నప్పటికీ సరైన పీడ్ బ్యాక్ ఇవ్వడం లేదని భావించి అనుచరులతో వివరాలు సేకరిస్తున్నారు. అదే విధంగా గ్రామాల్లో ప్రతిపక్ష పార్టీల పనితీరుపై సైతం వివరాలు తెలుసుకుంటున్నారు. గ్రామంలో అయితే పార్టీ వీక్‌గా ఉంటే ఆ గ్రామంలో ప్రధానంగా దృష్టిసారించేలా ఎమ్మెల్యేలు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అందులో భాగంగానే ఇతర పార్టీల కేడర్‌ను టీఆర్ఎస్‌లో చేరేలా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆయాపార్టీల్లో అసంతృప్తిగా ఉంటే వారిని గుర్తించి చేర్చుకునేలా పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీంతో ప్రతి గ్రామంలో టీఆర్ఎస్ మినహా ఏ ఇతర పార్టీల ఉనికి లేకుండా చేసేందుకు ప్రణాళికలు సైతం రూపొందించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల పనితీరును ఐప్యాక్ బృందం సర్వేలు నిర్వహిస్తు అధిష్టానానికి అందజేస్తుంది. ఎవరు నియోజకవర్గంలో ఉంటున్నారు... ఉండనివారు ఎవరు... ప్రజల్లో ఎలాంటి ఆధారణ ఉంది... రాబోయే ఎన్నికల్లో ఆ నియోజకవర్గంలో పరిస్థితి ఏంటీ... పార్టీనేతలు ఎంతమంది బరిలో ఉన్నారు? కుటుంబ నేపథ్యం... వివాదాల్లో తలదూర్చే వివరాలతో పాటు వివిధ అంశాలను సేకరిస్తున్నారు. సర్వేల్లో కొంతమంది పనితీరు బాగోలేదని రావడంతో వారి పనితీరు మెరుగుపర్చుకోవాలని ఇప్పటికే టీఆర్ఎస్ అధిష్టానం హెచ్చరికలు జారీ చేసింది. అయినా పలువురి తీరులో మార్పు రాకపోవడంతో వారికిచెక్ పెట్టేలా అధిష్టానం కసరత్తు ప్రారంభించినట్లు కేటీఆర్ ఈ మధ్యకాలంలో చేసిన వ్యాఖ్యల్లోనే స్పష్టమైంది. అసెంబ్లీ ఎన్నికల్ల గడువు సమీపిస్తుండటంతో ఎలాగైనా పనితీరును మెరుగుపర్చుకునేందుకు దిద్దిబాటు చర్యలు చేపట్టారు. నియోజకవర్గాల్లో పెండింగ్ పనులతో పాటు ప్రజాసమస్యలను తెలుసుకునే యత్నం చేస్తున్నారు. వారంలో ఎక్కువ రోజులు నియోజకవర్గంలో ఉంటున్నారు. మళ్లీ నిర్వహించే సర్వేల్లో పాజిటీవ్ వచ్చేలా, పార్టీ అధిష్టానం దగ్గర మంచిపేరు తెచ్చుకొని తిరిగి టికెట్ కేటాయించేలా ఎమ్మెల్యేలు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ప్రజాసమస్యలకు పరిష్కారం చూపేలా చొరవ తీసుకుంటుండటం గమనార్హం.

Related Posts