
సంగారెడ్డి
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొంది. మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా నిరసనలకు దిగిన భూ బాధితులపై మామిడిగి, ఎల్గోయి గ్రామాల్లో పోలీసులు లాఠీచార్జి చేసారు. ఘటనలో మహిళా రైతు స్పృహ తప్పి పడిపోయింది. ఆమేను ఆసుపత్రికి తరలించారు. .ఎల్గోయి, మామిడిగి గ్రామాలలో భూ బాధితులను అరెస్ట్ చేసారు.