YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మళ్లీ కరోనా కేసులు

మళ్లీ కరోనా కేసులు

హైదరాబాద్, జూన్ 23,
ఆరోగ్యం విష‌యంలో నిత్యం అప్ర‌మ‌త్తంగా వుండాల్సిన ప‌రిస్థితి  ఏర్ప‌డింది.  వెళిపోయిందనుకున్న భూతం తిరిగి వ‌చ్చింది. రాష్ట్రంలో మ‌ళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి.  ప్ర‌జ‌లు మ‌ళ్లీ మాస్కులు, భౌతిక దూరం పాటించక తప్పని పరిస్ధితులు దాపురించాయి. ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం స్వయంగా ప్రకటించింది. కోవిడ్ ప్రొటోకాల్ తప్పని సరిగా పాటించాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  దేశ వ్యాప్తంగా కోవిడ్ తొలిద‌శ‌లో ఎన్నో స‌మ‌స్య‌లు త‌లెత్తాయి, చాలామంది చ‌నిపోయారు. వూహించ‌ని విధం గా  కోవిడ్ వేగంగా విస్త‌రించి ప్ర‌పంచాన్ని ఖంగారుపెట్టింది. యావ‌త్ ప్ర‌జారోగ్య రంగం ప‌నివేళ‌ల ప‌రిమితి లేకుండా ప్ర‌జ‌ల ప్రాణాల్ని కాపాడేందుకు అహ‌ర్నిశ‌లూ శ్ర‌మించింది. శాస్త్ర‌వేత్త‌లు ఈ వూహించ ని విప‌త్తు నుంచి ప్ర‌జ‌ల్ని ర‌క్షించ‌డానికి మందులు త‌యారీలో త‌ల‌మున‌క‌ల‌య్యాయి. వాటి వుత్ప‌త్తి,  ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ అంగీకారాలు కాస్తంత జాప్యం చేయ‌డంతో మ‌ర‌ణాల సంఖ్య విప‌రీతంగా పెరిగి పోయింది. మొత్తానికి  కోవాక్స్‌, కోవిషీల్డ్ ఇంజ‌క్ష‌న్‌లు వ‌చ్చి మ‌ర‌ణాల సంఖ్య‌ను బాగా త‌గ్గించాయి.  కాస్తంత త‌గ్గు ముఖం ప‌డుతు న్న స‌మ‌యంలో రెండో విడ‌త కూడా కోవిడ్ దాడి చేసి మ‌రింత భ‌యపెట్టిం ది.  కానీ  మొద‌టి విడ‌త స‌మ‌యంలో దాని ల‌క్ష‌ణాలు, ప్ర‌భావం వేగం తెలుసుకున్న కార‌ణం గా  ప్ర‌భు త్వాలు, ఆరోగ్యరంగం మ‌రింత జాగ్ర‌త్త‌ల‌కు తీసుకోవ‌డానికి ప్ర‌జ‌లంతా ఏక‌మై అన్ని విధాల స్వ‌యం జాగ్ర‌త్త‌లు పాటించి ఎదుర్కొన‌డంలో విజ‌యం సాధించాం.ప్ర‌పంచ దేశాల్లో ఆరోగ్య రంగం అభివృద్ధికి  ప్ర‌త్యేక కేటాయింపులు చేయ‌డం, ప్ర‌జారోగ్యానికి అధిక ప్రాధాన్య‌త‌నీయ‌డం వంటివి కీల కంగా మారాయి. అన్ని దేశాల అధినేత‌లు ఈ విష‌యంలో ప్ర‌జ‌ల‌కు ఉన్న‌త‌స్థాయి  ప్ర‌చార కార్య క్ర‌మాలు చేప‌ట్టారు. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ నిబంధ‌న‌లు, సూచ‌న‌ల‌ను అనుస‌రించి  ప్ర‌భుత్వాలు ప్ర‌జారోగ్య రంగం లో వేగ‌వంతంగా  మంచి ఫ‌లితాలు సాధించేందుకు త‌గిన చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని  ఆదేశా లు జారీ చేసింది. ఫ‌లితంగా భార‌త్‌లోనూ క‌ఠిన ఆంక్ష‌లు విధించి  రెండో విడ‌త కూడా దాటి వేయ గ‌లిగాము. ఇందుకు ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌కు, ఆరోగ్య‌కేంద్రాలు, ఆస్ప‌త్ర‌లు, ప్ర‌జారోగ్య సేవా కేంద్రాలు చేసిన సేవ‌లు ప్ర‌జ‌లు ఎన్న‌టికీ గుర్తు పెట్టుకుంటారు. కోవిడ్ రెండో విడ‌త దాడి నుంచి బ‌య‌ట‌ప‌డిన త‌ర్వాత మూడో విడ‌త నాలుగో విడ‌త రావ‌చ్చ‌ని అన్నారు. కానీ అలాంటి ప‌రిస్థితులు క‌నిపించ‌లేదు. ఈ కారణంగా  ప్ర‌జ‌లు అంతా త‌మ త‌మ వృత్తి, వుద్యోగాలు, ప‌నుల‌కు ఉప‌క్ర‌మించ‌డంతో  కాస్తంత నిర్ల‌క్ష్యంగానే  వ్య‌వ‌హ‌రించ‌డం గ‌మ‌నార్హం. కోవిడ్ కార‌ణంగా ఆర్ధి కంగా ఇబ్బందులు ప‌డిన కార‌ణంగా అనేక సంస్థ‌లు, కార్యాల‌యాలు త‌మ వుద్యోగుల‌ను ఇంటి నుంచి ప‌నిచేయించారు. కార్యాల‌యాలు, ప‌రిశ్ర‌మ‌ల‌లో ఉత్ప‌త్తి నిర్వీర్య‌మ‌యిన కార‌ణంగా తిరిగి  రావ‌ల‌సిందిగా  కోర‌డంతో ప్ర‌జ‌లు కోవిడ్   జాగ్ర‌త్త‌ల‌ను గాలికి వ‌దిలేసేరు.  దీని ఫ‌లితంగా దేశంలో,   రాష్ట్రంలోనూ మ‌ళ్లీ కోవిడ్ విస్త‌రిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య బాగా పెరిగిపోతోంది.ఈ కార‌ణంగానే రాష్ట్ర‌ప్ర‌భుత్వం మ‌ళ్లీ  కోవిడ్  జాగ్ర‌త్త‌లు పాటించ‌డం ఎంతో అవ‌స‌ర‌మ‌ని హెచ్చ‌రించింది.   ప్ర‌జ‌లంతా త‌ప్ప‌కుండా  మ‌ళ్లీ భౌతిక దూరాన్ని పాటించాల‌ని, మాస్క్‌లు త‌ప్ప‌కుండా వాడాల‌ని,  ప‌ది యేళ్ల లోపువారు, 60 యేళ్లు దాటిన‌వారు బ‌య‌ట తిర‌గ‌రాద‌ని, డాక్ట‌ర్లు  చెప్పిన ఆరోగ్య‌సూత్రాలు  త‌ప్ప కుండా  పాటించాల‌ని, కోవిడ్  ఇంజ‌క్ష‌న్స్  మ‌రో విడ‌త  తీసుకోవ‌డానికి  సిద్ధ‌ప‌డాల‌ని ప్రభుత్వం హెచ్చ రించింది.  

Related Posts