YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

తెలంగాణలో ఉచితాలకు మంగళం..

తెలంగాణలో ఉచితాలకు మంగళం..

హైదరాబాద్, జూన్ 23,
తెలంగాణలో ఉచితాలకు మంగళం పాడుతున్నారు. మిషన్ భగీరథ కింద రాష్ట్రమంతా ఉచితంగా తాగునీళ్లు అందజేస్తున్నామని సీఎం కేసీఆర్ సహా రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు బహిరంగంగా ప్రకటిస్తున్నా ఎక్కడా ఫ్రీగా ఇవ్వడం లేదు. గ్రామాల్లో ఏడాదికి సంబంధించిన నల్లా బిల్లు మొత్తం ఒకేసారి వసూలు చేస్తున్నారు. కొన్నిచోట్ల ప్రతి ఆరు నెలల బిల్లు చెల్లించాలని చెప్తున్నారు. నీటి పన్ను కింద ఈ ఆరు నెలల కాలానికి రూ. 480 చొప్పున వసూలు చేశారు. మిషన్ భగీరథ నీళ్లు ఉచితమే అంటే.. ప్రస్తుతం ప్రభుత్వం నుంచి నయాపైసా రావడం లేదని, నీటి పన్నులు వసూలు చేస్తామని పంచాయతీ కార్యదర్శులు స్పష్టం చేస్తున్నారు. దీనిపై పంచాయతీ రాజ్ శాఖ స్టేట్ అధికారి మాట్లాడుతూ, ప్రభుత్వం నుంచి తమకు అధికారికంగా ఎలాంటి ఆదేశాలు లేవని, ఉచిత నీటిని ఇవ్వలేమని, నీటి పన్నులు వసూలు చేయాల్సిందేనని ఆదేశించామని వెల్లడించారు.గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు ఇండ్ల యజమానులపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. దీనిలో భాగంగా పంపిణీ చేసే పింఛన్లలో నీటి పనులు, ఇంటి పన్నులు మినహాయించుకుని మిగిలిన సొమ్ము ఇస్తున్నారు. చాలా గ్రామాల్లో దీనిపై గొడవలకు దిగుతున్నా.. పంచాయతీ కార్యదర్శులు ససేమిరా ఒప్పుకోవడం లేదు. ఒకవేళ పింఛన్లు లేకుంటే.. పంచాయతీకి సంబంధించిన ఏదైనా ధృవీకరణ పత్రాలు ఇచ్చే సమయంలో మొత్తం బకాయిలను ఒకేసారి చెల్లించుకుంటున్నారు. రశీదుల్లోనూ నీటి పన్నులు అంటూ స్పష్టం చేస్తున్నారు.నీటి పన్ను వసూలు చేయొద్దని తమకు ఎలాంటి ఆర్డర్రాలేదని స్థానిక సంస్థల అధికారులు చెప్తున్నారు. దీనిపై ఓ జిల్లా పంచాయతీ అధికారి మాట్లాడుతూ రాష్ట్రస్థాయి నుంచి నీటి పన్ను వసూళ్లపై అధికారికంగా ఉత్తర్వులు లేవని, పంచాయతీలకు ఆదాయం లేదని, దీంతో నీటి పన్నులు వసూలు చేస్తున్నామంటున్నారు. నల్లా బిల్లు కట్టకుంటే కనెక్షన్ కట్చేస్తామని హెచ్చరిస్తున్నారు. మైనర్పంచాయతీల్లో ప్రతినెలా రూ.50 నుంచి రూ.80, మేజర్ పంచాయతీల్లో రూ.100 నుంచి రూ. 130, మున్సిపాలిటీల్లో రూ.100 నుంచి రూ. 200 వరకు వాటర్ టాక్స్వేస్తున్నారు. ఇలా రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ఏడాదికి కనీసం రూ. 580 నుంచి రూ. 1,200 దాకా నల్లా బిల్లులు కట్టించుకుంటున్నారు.రాష్ట్రంలో 99 శాతం మిషన్ భగీరథ నీటిని అందిస్తున్నామని చెప్తున్న సర్కారు.. కనీసం నిర్వహణకు కూడా రూపాయి ఇవ్వడం లేదు. గతంలోని ఆర్‌డబ్ల్యుఎస్ పథకాల నుంచి ఇచ్చిన నల్లా నీటికి నిర్వహణ ఖర్చులు నెలకు రూ.10 చొప్పున వసూలు చేసేవారు. కానీ, భగీరథ నీళ్ల పథకంలో ఇస్తున్నామని చెప్తూ ఈ బిల్లును ఏకంగా రూ. 100 వరకు పెంచారు. కొన్నిచోట్ల పాత పథకాల ద్వారానే నల్లాల నీళ్లు ఇస్తున్నా.. బిల్లులు మాత్రం ఎక్కువ వేస్తున్నారు. పల్లె ప్రగతి కింద పంచాయతీలకు ఎంతో కొంత ఇస్తున్నా.. అవన్నీ కరెంట్ బిల్లులు, మల్టీపర్పస్వర్కర్ల వేతనాలకే సరిపోతున్నాయి. ఇంకా ట్రాక్టర్ల ఈఎంఐ, డీజిల్ఖర్చులు పంచాయతీలు భరించుకోవాల్సి వస్తోంది. దీంతో పంచాయతీలపై పన్నుల భారం మోపుతున్నారు.

Related Posts