YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

ధోనీకి పద్మభూషణ్.. శ్రీకాంత్‌కు ‘పద్మశ్రీ’

ధోనీకి పద్మభూషణ్.. శ్రీకాంత్‌కు ‘పద్మశ్రీ’

ధోనీకి పద్మభూషణ్ 

పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాలకు చెందిన 85 మంది ప్రముఖులకు ప్రతిష్టాత్మక పద్మ పౌర పురస్కారాలను ప్రకటించింది. ఇందులో క్రీడా రంగానికి సంబంధించి తెలుగు తేజం, హైదరాబాద్ స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్‌కు పద్మశ్రీ అవార్డు లభించింది. గతేడాది శ్రీకాంత్ అద్భుత ప్రతిభ కనబరిచాడు. ఒకే క్యాలెండర్ ఇయర్‌లో నాలుగు సూపర్ సిరీస్ టైటిళ్లు గెలిచిన భారత తొలి షట్లర్‌గా ఘనత సాధించాడు. టీమిండియా మాజీ కెప్టెన్, జార్ఖండ్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీకి పద్మభూషణ్ అవార్డు వరించింది. గత ఏడాది ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లతో జరిగిన సిరీస్‌లలో ధోనీ తన తెలివైన ఎత్తుగడలను, జట్టుకు తనవంతు సహకారాన్ని అందిస్తూ టీమిండియాకు అండగా నిలిచాడు.

త్రిపురకు చెందిన భారత టెన్నిస్ ప్లేయర్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్‌కు పద్మశ్రీ అవార్డు లభించింది. మహారాష్ట్రకు చెందిన స్విమ్మర్ మురళీ కాంత్ పెట్కర్‌కు కూడా పద్మశ్రీ అవార్డు లభించింది. ఈయన 1972లో జర్మనీలో జరిగిన పారాలింపిక్స్‌లో భారత్‌కు తొలి పారాలింపిక్ స్వర్ణ పతకాన్ని అందించారు. 50 మీటర్ల ఫ్రీ స్టైల్‌లో 37.33 సెకన్లతో వరల్డ్ రికార్డును నెలకొల్పారు. అంతేకాకుండా అదే ఒలింపిక్స్‌లో మరో మూడు (జావెలిన్, ప్రెసిషన్ జావెలిన్, స్లాలోమ్) ఈవెంట్లలో ఈయన ఫైనలిస్ట్‌గా నిలిచారు. అంతేకాకుండా భారత ఆర్మీలో ఈయన ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్‌లో జవాన్‌గా పనిచేశారు. 1965లో జరిగిన ఇండియా, పాకిస్థాన్ యుద్ధంలో ఈయనకు వెన్నెముకలో బుల్లెట్ దిగడం వల్ల చేతిని కోల్పోయారు.

Related Posts