
జియో.. టెలికాం రంగంలో కొత్త ట్రెండ్ సెట్ చేసిన సంగతి తెలిసిందే. ‘మాకు మేమే.. మాకెవ్వరు సాటిలేరు’ అన్నట్లుగా ఇతర కంపెనీలకు దరిదాపుల్లోకి రానివ్వకుండా యావత్ దేశ వ్యాప్తంగా వినియోగదారులను సరికొత్త ఆఫర్లతో తన వైపు లాక్కుంది. అలా రాణిస్తున్న జియోకు మించి ఇవ్వలేకపోయినా కాస్తోకూస్తో ఎయిర్‌టెల్, ఐడియా, వొడాఫోన్ లాంటి సంస్థలు ఆఫర్లు ఇస్తూ వినియోగదారులను నిలబెట్టుకోగలుగుతున్నాయి. ఇటీవల జియో మళ్లీ ఆఫర్ విడుదల చేయడంతో దానికి కౌంటర్‌గా ఎయిర్‌టెల్ సంస్థ కొత్త ప్రీపెయిడ్ ఆఫర్‌ను లాంచ్ చేసింది.ఈ ఆఫర్ ఇచ్చిన కొద్దిరోజులకే జియోకు పోటీగా ఎయిర్‌టెల్ సరికొత్త ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది. కాగా జియోకు పోటాపోటీగా ఉంటోంది.. మొదట్నుంచి ఒక్క ఎయిర్‌టెల్ మాత్రమే అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో. కాగా ఎయిర్‌టెల్ అందుబాటులోకి తెచ్చిన వివరాల ప్రకారం.. రూ. 558కే 82 రోజులపాటు డేటా, కాల్స్‌తో పాటు ఎస్‌ఎంఎస్‌లు కూడా ఇస్తోంది. అయితే జియో మాత్రం 509 రూపాయిలకు కేవలం ఒక్క నెల మాత్రమే ఇస్తోంది. దీంతో జియో వినియోగదార్లు కూడా ఎయిర్‌టెల్‌కు మారే అవకాశాలు మెండుగా ఉన్నాయి
ప్లాన్: రూ. 558
డేటా: 3జీబీ డేటా (ప్రతి రోజూ)
కాల్స్: అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్టిడీ కాల్స్
ఎస్ఎంఎస్‌లు: రోజుకు వంద మాత్రమే
వ్యాలిడిటీ: 82 రోజులు మాత్రమే.
జియో ప్లాన్ వివరాలివీ..
ప్లాన్: రూ.509
డేటా: రోజుకు 4జీబీ డేటా
వ్యాలిడిటీ: 28 రోజులు
ఎస్ఎంఎస్‌లు: రోజుకు వంద మాత్రమే.