YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఒక్క ఉద్యోగం రాలేదు దేవినేని

ఒక్క ఉద్యోగం రాలేదు దేవినేని

మైలవరం
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన మూడేళ్ల పరిపాలనలో ఏ ఒక్క యువకుడికి  ఉద్యోగం ఇచ్చిన పాపం లేదని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమ ర్శించారు.కృష్ణా జిల్లా మైలవరం పట్టణంలో జాబ్ క్యాలెండర్పై మాజీ మంత్రి నాయకత్వంలో టిడిపి నాయ కులు నిరసన ప్రదర్శన చేశారు. 2, 30, 000 ఉద్యోగాల భర్తీ చేస్తానని నాడు యూనివర్సిటీలు కళాశాలలో తన పేటీఎం మనుషులను పెట్టుకొని మాట్లాడించి ప్రత్యేక హోదా వస్తేనే మనకు పరిశ్రమలు ఉద్యోగాలు వస్తాయి అని యువతను మోసం చేసిన ఫేక్ ముఖ్యమంత్రి ఈ జగన్ రెడ్డి తన కార్యకర్తలకు వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చుకొని నేను ఏదో గొప్పగా ఉద్యోగాలు ఇస్తున్నానని తన సొంత పత్రికలో కోట్ల ప్రజాధనం వృధా చేసి యువతను మోసం చేసిన జగన్ మోహన్ రెడ్డిని గద్దతించేవరకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో టీఎన్ఎస్ఎఫ్ తెలుగు యువత పోరాడుతుందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఫిష్ మార్ట్ చికెన్ షాపులు వైన్ షాపులు చీప్ లిక్కర్ అమ్మే ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగ యువతని మోసం చేస్తున్న ఈ దుర్మార్గం ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో లేడు. తెలుగుదేశం పార్టీ హయాంలో నాసిరకం మందు గంజాయి డ్రగ్స్ లను అరికడితే ఈ ప్రభుత్వంలో ప్రతి గ్రామానికి గంజాయి జే బ్రాండ్ మందు చీప్ లిక్కర్ డ్రగ్స్ విచ్చలవిడిగా అమ్మటం యువత జీవితాలను నాశనం చేయటమే అని విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదైతే తన పాదయాత్రలో విడుదల చేస్తానన్న వార్షిక క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలి లేని పక్షంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమం తీవ్రతరం చేస్తాం యువతకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని తెలియజేశారు.

Related Posts