YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

తెరపైకి ఎస్టీ రిజర్వేషన్లు... కేసీఆర్ మైండ్ గేమ్ లో కమలం

తెరపైకి ఎస్టీ రిజర్వేషన్లు... కేసీఆర్ మైండ్ గేమ్ లో కమలం

హైదరాబాద్, సెప్టెంబర్ 19, 
రాష్ట్రంలో మళ్లీ కొత్త కథ ముందుకు పడింది. ఓవైపు లిక్కర్ స్కాం ప్రకంపనలు అతలాకుతలం చేస్తుండగా.. ఇదే సమయంలో బీజేపీ తెలంగాణపై కాషాయం జెండా ఎగురవేయాలని తహతహలాడుతోంది. దీంతో జాతీయ నేతలు ఇటువైపే దారి పట్టారు. ఇంతకు ముందు సెప్టెంబర్17 విమోచనం, అవతరణ వేడుకలు ఎందుకు చేయాలని అసెంబ్లీలోని ప్రశ్నించిన సీఎం కేసీఆర్.. ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్న విషయం స్పష్టమైంది. ఇదే సమయంలో బంజారా భవన్ప్రారంభ వేడుకల్లో కేసీఆర్రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు. దీంతో ఇప్పుడు మళ్లీ చర్చంతా ఇటువైపే మళ్లింది. ఈ రిజర్వేషన్ల కోణంలో కేంద్రాన్ని మరోసారి టార్గెట్చేశారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. కీలక సమయంలో రాష్ట్రం దృష్టిని మొత్తం మళ్లీ రిజర్వేషన్ల వైపు మళ్లించారు.కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్సర్కారు మధ్య రాజ‌కీయంగా దుమారం కొనసాగుతూనే ఉంది. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి సాయం అందక‌పోవ‌డంతో సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రధాని మోడీ స‌ర్కారుపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శలు గుప్పిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పటికే మాట‌ల యుద్ధం న‌డుస్తుండ‌గా ప్రస్తుతం మ‌రో అంశం తెర‌మీద‌కు వ‌చ్చి పొలిటిక‌ల్ హీట్ పెంచుతోంది. ఎస్టీ రిజర్వేషన్ల శాతాన్ని పెంపొందించే బిల్లును 2017లోనే రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించి, ఆమోదం కోసం కేంద్రానికి పంపారు. కానీ, దాదాపు ఐదేండ్ల త‌ర్వాత చర్చకెక్కింది. ఎస్టీలకు రిజర్వేషన్లను 12 శాతానికి పెంచాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ప్రతిపాదన రాలేదని గతేడాది మార్చి 21న కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు లోక్‌సభలో చెప్పడంతో హీటెక్కించింది. దీనిపై టీఆర్ఎస్ఎదురుదాడి చేసింది. పార్లమెంట్‌లో 'పచ్చి అబద్ధాలు' చెప్పినందుకు మంత్రిని పదవి నుండి తొలగించాలని, లోక్‌సభను తప్పుదారి పట్టించారని నిలదీసింది. రాష్ట్రం నుంచి ఎస్టీలకు 6 శాతం నుంచి 10 శాతానికి పెంచే బిల్లును అసెంబ్లీ ఆమోదించి గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు పంపిందని టీఆర్‌ఎస్ స్పష్టం చేసింది. 2017లో అసెంబ్లీలో వెనుకబడిన ముస్లింలు, ఎస్టీల రిజర్వేషన్ కోటాను వరుసగా 12, 10 శాతానికి పెంచుతూ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించారు. కానీ, ఈ ఫైల్‌ను కేంద్రానిక పంపించలేదని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించడం వివాదంగా మారింది.తమిళనాడు రాష్ట్రం చేసిన విధంగా రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చాలంటూ రాష్ట్రపతి ఆమోదం కోసం బిల్లును కేంద్రానికి పంపారు. ఈ బిల్లు తెలంగాణలో మొత్తం రిజర్వేషన్లను 62 శాతానికి పెంచింది. కేంద్రం, రాష్ట్రాల్లో అన్ని రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు 50 శాతం పరిమితి విధించినందున రాజ్యాంగ సవరణ ద్వారా సడలించాలని టీఆర్ఎస్ కేంద్రానికి చెప్పింది. ''తమిళనాడులో రెండు దశాబ్దాలుగా 69 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. ఐదు నుంచి ఆరు రాష్ట్రాలు 50 శాతానికి పైగా రిజర్వేషన్లు కల్పిస్తున్నాయి. దీన్ని తెలంగాణకు ఎలా నిరాకరిస్తారు?'' అంటూ సీఎం కేసీఆర్ గతంలోనే ప్రశ్నించారు. తమ అభ్యర్థనను కేంద్రం అంగీకరించని పక్షంలో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని కూడా ఆయన ప్రకటించారు. 50 శాతానికి మించి రిజర్వేషన్లు కల్పించడంలో రాజ్యాంగపరమైన అడ్డంకి లేదని కేసీఆర్ వాదించారు. కేంద్రాన్ని అడుక్కోనని, కొత్త కోటాను 9వ షెడ్యూల్‌లో చేర్చేందుకు పోరాడతానని కేసీఆర్ అసెంబ్లీలో స్పష్టం చేశారు. తాజాగా ఇప్పుడు కూడా మళ్లీ అవే వ్యాఖ్యలను కేసీఆర్రిపీట్ చేశారు. ఇక రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో గిరిజనుల జనాభా 9.34 శాతం ఉండగా.. 2014 సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 9.98 శాతంగా తేలింది.10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అనుమతించిన సుప్రీంకోర్టు.. 1992 నాటి ఇందిరా సాహ్నీ కేసులో ఇచ్చిన 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని 2021లో కూడా ధృవీకరిస్తూ తీర్పునిచ్చిన అంశం ఇప్పుడు మరోసారి తెరపైకి వస్తోంది. ఈడబ్ల్యూఎస్‌తో కలుపుకుని మొత్తంగా 60 శాతం రిజర్వేషన్ల అమలుకు అనుమతించిన అత్యున్నత న్యాయస్థానం.. రాష్ట్రాల విషయంలో మాత్రం 50 శాతం పరిమితిని విధించింది. సామాజిక రిజర్వేషన్లు 50% మించరాదని సుప్రీంకోర్టు గతేడాది కూడా తీర్పు ఇచ్చింది. 102వ రాజ్యాంగ సవరణ ద్వారా 342ఏ ఆర్టికల్‌ను సృష్టించడంతో రాష్ట్రాల హక్కులకు జరిగే భంగం మీద రాష్ట్రాల అభిప్రాయాలను కోరి రెండు నెలలు కాకముందే ఈ తీర్పు వెలువడింది.కానీ, రాష్ట్రంలో ఇప్పటికే బలహీన వర్గాలకు 50 శాతం మేర రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశానుసారం దేశంలో 50 శాతానికి మించి రిజర్వేషన్ల అమలు సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో గిరిజనుల రిజర్వేషన్ల పెంపు ఎంత వరకు సాధ్యమనేది ఇప్పడు చర్చనీయాంశంగా మారింది.రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి గతంలోనూ జరిగింది. బీసీలకు 40 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తామని ఎన్టీఆర్సర్కారు హాయాంలో ప్రకటించారు. దీనిపై మిగిలిన వర్గాలు భగ్గుమన్నాయి. రోడెక్కాయి. కోర్టుల్లో పిటిషన్ దాఖలు చేశారు. అటు సుప్రీం కోర్టు కూడా నెల రోజుల వ్యవధిలోనే స్పందించి, 50 శాతం మించరాదంటూ ఉటంకించింది. ఫలితంగా ఎన్టీఆర్సర్కారు వెనక్కి తగ్గింది.రాష్ట్రంలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎస్టీ రిజర్వేషన్ అంశాన్ని కేసీఆర్వ్యూహాత్మకంగా తెరపైకి తీసుకువచ్చారనే ప్రచారం జరుగుతోంది. ఈ కోణంలో కేంద్రాన్ని బ్లేమ్చేస్తూనే.. రాష్ట్రంలో అనుకూలంగా మల్చుకుంటారని రాజకీయ వర్గాలు విశ్లేసిస్తున్నాయి. ఇదే ట్రాప్‌లో అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్కూడా చిక్కుకుంటాయని, ఫలితంగా కీలక విషయాలు దారి మళ్లుతాయని భావిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో కీలకమైన ఎన్నికల సమయంలో ఈసారి బీజేపీపై టీఆర్‌ఎస్ ఒత్తిడి పెంచడంతో పాటు మ‌రిన్ని విష‌యాల‌ను జోడిస్తూ కేంద్రంపై విరుచుకుప‌డేందుకు సిద్ధమ‌వుతున్న ప‌రిస్థితులు కనిపిస్తున్నాయంటున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో తాము కచ్చితంగా అమలు చేస్తామని, వారం రోజుల్లో జీవో జారీ చేయాలని సీఎస్‌కు సైతం ఆదేశించారు. కానీ, ఇక్కడే అసలు కథ మొదలవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం జీవో జారీ చేసిన తర్వాత కేసీఆర్‌కు అనుకూలంగా ఉండే ఒక వర్గం కోర్టులో పిటిషన్దాఖలు చేస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఎన్నికల వరకూ ఇది ప్రచారాస్త్రంగా పనికి వస్తుందని కేసీఆర్ప్లాన్అంటూ రాజకీయపక్షాలు చెప్తున్నాయి.

Related Posts