YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

త్రిశంకు స్వర్గంలో జనసేన

 త్రిశంకు స్వర్గంలో  జనసేన

విజయవాడ, సెప్టెంబర్ 23, 
రాజకీయ నాయకుడిగా అవతారం ఎత్తిన, ప్రముఖ హీరో, జన సేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా అలాగే ఉందని అంటున్నారు. కమలం ఉచ్చులో గిలగిలలాడుతున్న ఆయన పరిస్థితి రాజకీయాలలోకి ఎరక్కపోయి వచ్చాను.. ఇరుక్కుపోయాను అని మధన పడేలా ఉందని పరిశీలకులు అంటున్నారు.ఆయన అభిమానులు. బీజేపీ, జనసేన మిత్ర పక్షాలు. 2019 ఎన్నికలకు ముందు బీజేపీతో తెగతెంపులు చేసుకున్న పవన్ కళ్యాణ్ ఎన్నికల తర్వాత మళ్ళీ బీజేపీతో జట్టు కట్టారు. మాంగల్యానికి మూడు ముళ్ళు అన్నటుగా బీజేపే మెడలో మరో మూడు ముళ్ళు వేశారు. అయితే, ఆ తర్వాత, ‘చెలియ లేదు చెలిమి లేదు, వెలుతురే లేదు’ అన్నట్లుగా, ‘చేసుకున్న బాసలు, చెప్పుకున్న ఉసులు’ ఏమై పోయాయో కానీ, ఎవరి దారిన వారు, అడుగులు వేస్తున్నారు,నడక సాగిస్తున్నారు.  అయినా, బీజేపీ నాయకులు టీవీ చర్చల్లో జనసేన తమ మిత్ర పక్షం అనే అంటారు. 2024 ఎన్నికల్లో ఇద్దరం కలిసి దుమ్ముదులిపేస్తాం అంటారు.అధికారం మాదే అంటారు. అంతే, అంతకు మించి ఇంకొక్కమాట మాట్లాడరు. అలాగే, ముఖ్యమంత్రి ఎవరన్నది బీజేపీ నాయకులు వాళ్ళంతట వాళ్ళు చెప్పరు. చివరకు, జనసేన నాయకులు సిగ్గువిడిచి, నోరు తెరిచి అడిగినా, బీజేపే నేతలు పెదవి విప్పరు. పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించాలని ప్ల  కార్డులు పట్టుకుని, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఎదుట ప్రదర్శనలు చేసినా, పట్టించుకోరు.  ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా, పార్టీ జాతీయ నాయకులు వచ్చి పోతుంటారు, కానీ, రాష్ట్రంలో మిత్ర పక్షం ఒకటుందని ఒక్కరు కూడా కనీసం గుర్తించనైనా గుర్తించరు. ఒక పిలుపు ఒక పలకరింపు ఏవీ ఉండవు.  మెగా ఫ్యామిలీ స్టార్ హీరో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పక్కనే ఉన్నా ఆయన్ని పట్టించుకోరు, కానీ అదే అమిత్ షా జూనియర్ ఎన్టీఅర్ తో గంటలు భేటీ అవుతారు. బీజేపీ అధ్యక్షుడు నడ్డా, మరో హీరో నితిన్ తో భేటీ అవుతారు. సరే ఆయన కలుద్దామనుకున్నది నితిన్ ను కాదు, మరో కుర్ర హీరో నిఖిల్ ని అనీ, ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ తో అల జరిగిపోయిందని అంటున్నారు. సరే, ఆయన కలవాలనుకున్నది నితిన్ అయినా నిఖిల్ లేదా హీరో ఎవరైనా ఆది ఇప్పడు అప్రస్తుతం. మెగా ఫ్యామిలీ పవర్ స్టార్ అని కాకపోయినా, మిత్ర పక్షం అధ్యక్షుడిగా అయినా జాతీయ నాయకులు రాష్ట్రానికి వచ్చినప్పుడు,పవన్ కళ్యాణ్ ను కనీసం హలో అని అయినా పలకరించాలి కదా, అని ఆయన అభిమానులు నొచ్చుకుంటున్నారు.బీజేపీ ఉచ్చులో చిక్కుకుని, పవన్ కళ్యాణ్  ఎటూ కాకుండా, త్రిశంకు నరకంలో తేలియాడుతున్నారని అంటున్నారు.  అయితే, కొంచెం చాలా ఆలస్యంగానే అయినా పవన్ కళ్యాణ్  బీజేపీ గేమ ప్లాన్ అర్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. మిత్ర పక్షం పేరును అడ్డుపెట్టుకుని జనసేనను బీజేపీ నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తోందని, అందుకే, పవన్ కళ్యాణ్ బిగ్ బ్రదర్, మెగా స్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ సహా అనేక మంది హీరోలను తమ గూటికి తెచ్చుకునే ప్రయత్నం కమల దళం  చేస్తోందని అంటున్నారు.అందుకే పవన్ కళ్యాణ్ బీజేపీ కబంధ హస్తాల నుంచి ఎంత త్వరగా బయట పడితే అంత మంచిదని పవన్ కళ్యాణ్ హితేషులు సూచిస్తున్నారు. నిజానికి, పవన్ కళ్యాణ్ మార్చిలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలోనే, వైసీపీ ప్రభుత్వ  అరాచక పాలనను అంతం చేయడమే తమ లక్ష్యమని ప్రకటించారు. అందుకే, వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చెదిరి పోకుండా చూడాలని స్పష్టం చేశారు. అలాగే జనసేన ముందు మూడు ప్రత్యన్మాయాలున్నాయని వివరించారు. అయితే, బీజేపీ మాట తప్పి పక్క చూపులు చూస్తున్న తాజా  పరిణామాల నేపధ్యంలో, బీజేపీతో పొత్తు ఆప్షన్ ఇక లేనట్లేనని అంటున్నారు పవన్ కళ్యాణ్ ముందు రెండే ప్రత్యన్మాయాలున్నాయని, అందులో ఒంటరిగా పోటీచేసే ఆప్షన్ , మరొకటి తెలుగు దేశంతో పొత్తు ఆప్షన్  అని అంటున్నారు. అయితే, దేనికైనా సరైన సమయం రావలసి ఉంటుందని అంటున్నారు. అయితే పవర్ స్టార్ అభిమానులు మాత్రం ఎదురు చూపులు ఇక చాలు అంటున్నారు. అంతేకాదు, పవర్ స్టార్ అభిమానులే కాకుండా మెగా అభిమానులు కూడా బీజేపీతో తెగతెంపులు చేసుకోవాలని పవన్ కళ్యాణ్ పై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది.

Related Posts