YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

టాలీవుడ్ లో బిగ్ ఫైట్

టాలీవుడ్ లో బిగ్ ఫైట్

హైదరాబాద్, సెప్టెంబర్ 23, 
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం ఆసక్తిగా మారుతున్నది. అనూహ్య పరిణామాలు, ఊహించని ఎత్తుగడలతో పార్టీల మధ్య పొలిటికల్ వార్ పీక్స్ కు చేరుతున్నది. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల నాటికి పార్టీల్లో సెలబ్రిటీ గ్లామర్ ను జోడించే విధంగా ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు సినీ, క్రీడా రంగ ప్రముఖులతో వరుస భేటీలు నిర్వహించడం తెలుగు పొలిటికల్ సినారియోలో ఉత్కంఠ రేపుతోంది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ కావడం ఆసక్తికర పరిణామంగా మారింది. అయితే ఆర్ఆర్అర్ మూవీలో నటన ఆకట్టుకునే రీతిలో ఉండటం వల్లే ఎన్టీఆర్ ను అమిత్ షా కలిసినట్లు ప్రచారం జరిగింది. అయితే అదే సినిమాలో కీలకమైన రోల్ పోషించిన రామ్ చరణ్ ను ఆహ్వానించకుండా కేవలం ఎన్టీఆర్ నే పిలవడంపై రాజకీయం రాజుకుంది. దాంతో ఇది పక్కా పొలిటికల్ మీటింగ్ అంటూ చర్చ మొదలైంది. బీజేపీ మొదలు పెట్టిన మీటింగ్ పాలిటిక్స్ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ భేటీ నందమూరి, మెగా అభిమానుల మధ్య ఓ రకమైన కోల్డ్ వార్ కు దారి తీసినంత పని చేసింది. ఈ వ్యవహారం ఇలా కొనసాగుతుండగానే తాజాగా బుధవారం కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం మరో సంచలనంగా మారింది.చిరంజీవి ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైన చాలా కాలమే అయింది. కానీ ఆయన మంగళవారం చేసిన ట్వీట్ సినీ, రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా దుమారానికి కారణణం అయింది. తాను రాజకీయాలకు దూరం అయినా.. తన నుండి రాజకీయాలు దూరం కాలేదంటూ ఓ వాయిస్ ట్వీట్ ను చిరంజీవి చేయడం చర్చకు దారి తీసింది. ఇది 'గాడ్ ఫాదర్' సినిమాలోని ఓ డైలాగ్ గా అందరూ చెప్పుకుంటున్నప్పటికీ రాజకీయ వర్గాల్లో మరో రకంగా చర్చ జరుగుతోంది. చిరంజీవి తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నాడని అందులో భాగంగానే ఈ ట్వీట్ చేశారనే టాక్ వినిపిస్తోంది. అయితే తమ్ముడు పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ గా చిరంజీవి రాజకీయాల్లోకి రావాలని జనసైనికులు చాలా కాలంగా కోరుకుంటున్నారు. కానీ చిరంజీవి మాత్రం ఎపీ సీం జగన్ తో సత్సంబంధాలు కొనసాగిస్తూ వస్తున్నారు. చిరంజీవి వ్యవహారం పవన్ కళ్యాణ్ పార్టీ నేతలకు మింగుడుపడని వ్యవహారంగా మారుతూ వస్తోంది. అయిన తమ అన్న చిరంజీవి సపోర్ట్ తమకెప్పుడు ఉంటుందని పవన్ కళ్యాణ్, నాగబాబు చెబుతున్నారు. ఇంతలో కాంగ్రెస్ సంచలన ప్రకటన చేయడం రచ్చకు దారి తీస్తోంది.రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. ఏ ఒక్క ఎన్నికల్లోనూ సత్త చాటలేక చతికిలపడుతూ వస్తున్నది. ఈ క్రమంలో చిరంజీవికి పీసీసీ డెలిగేట్ గా గుర్తిస్తూ ఐడీ కార్డు జారీ చేయడం వెనుక కాంగ్రెస్ పార్టీ బీజేపీకి చెక్ పెట్టే వ్యూహానికి తెరతీసిందనే వాదన వినిపిస్తోంది. రాబోయే ఎన్నికల నాటికి పార్టీలో సెలబ్రిటీ జోష్ పెంచాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను మెగా కాంపౌండ్ నుండి చెక్ పెట్టాలనే ఎత్తుగడ కాంగ్రెస్ వేస్తున్నదని, అందువల్లనే చాలా కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న మెగాస్టార్ చిరంజీవిని తిరిగి పార్టీలో యాక్టివ్ చేసే ప్రయత్నం చేస్తోందనే చర్చ జరుగుతున్నది. పార్టీకి రాజీనామా చేయకపోవడంతో టెక్నికల్ గా చిరంజీవిని తమ వాడిగానే ప్రమోట్ చేయాలని కాంగ్రెస్ అంచనాగా తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్ష ఎన్నికలకు అతి ముఖ్యమైన డెలిగేట్ జాబితాలో చిరంజీవిని గుర్తించడం ద్వారా కాంగ్రెస్ లోకి సైతం టాలీవుడ్ నుండి సెలబ్రిటీ జోష్ పెంచే ప్రయత్నాలకు తెరలేపినట్లుగా చర్చ సాగుతున్నది. చిరంజీవి గనుక కాంగ్రెస్ లో యాక్టివ్ అయితే మెగా కాంపౌండ్ లోని హీరోలతో పాటు సినీ ఇండస్ట్రీలోని మరి కొంత మంది ప్రముఖులు హస్తం పార్టీతో కలిసి నడుస్తారని,ఇదే నిజమైతే ఏపీలో ఎలా ఉన్న తెలంగాణలో పార్టీకి కాస్త ప్లస్ అయ్యే అంచనాలతోనే ఈ ప్రయత్నం చేస్తోందనే విశ్లేషణలు వెలువడుతున్నాయి.పార్టీలోకి సినీరంగానికి చెందిన నటీనటులను ఆహ్వానించడం విషయంలో బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తున్నది. ఇప్పటికే జూ.ఎన్టీఆర్ తో అమిత్ షా, నిఖిల్ తో జేపీ నడ్డా భేటీ కాగా చేరికల కమిటీ చైర్మన్ తో దివ్యవాణి సమావేశమైన పార్టీలోకి వచ్చేందుకు ఆసక్తిని ప్రకటించారు. ఇక జీవిత రాజశేఖర్ బీజేపీలో చేరి పొలిటికల్ గా యాక్టివ్ రోల్ పోషించాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలాగు విజయశాంతి సీనియర్ నేతగా పార్టీలో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరపున చిరంజీవి క్రియాశీలంగా వ్యవహరిస్తే టాలీవుడ్ నటీనటుల మధ్య రాజకీయం మరింత రసవత్తరంగా సాగే అవకాశాలు ఉన్నాయంటున్నారు సినీ, రాజకీయ పండితులు. రాజకీయాలను ఉద్దేశించి ట్వీట్ చేసిన గంటల వ్యవధిలో చిరంజీవిని తమ పార్టీ వ్యక్తికి చెందిన వ్యక్తిగా గుర్తిస్తూ కీలకమైన జాబితాలో కాంగ్రెస్ చోటు కల్పించడం చర్చనీయాంశంగా మారింది. ఈ కాంగ్రెస్ నిర్ణయంపై చిరు ఎలా స్పందిస్తారు ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ ఎలా రియాక్ట్ అవుతారనేది ఉత్కంఠగా మారింది.

Related Posts