YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

30 ఏళ్ల క్రితమే మోడీ ప్రపంచ శాంతి కల వైరల్ గా మారిన మోడీ డైరీ

30 ఏళ్ల క్రితమే  మోడీ ప్రపంచ శాంతి కల వైరల్ గా మారిన మోడీ డైరీ

న్యూఢిల్లీ, సెప్టెంబర్  23, 
ప్రధాని నరేంద్ర మోదీ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా, నవ భారత్ కల దానితో ముడిపడి ఉంటుంది. గత ఎనిమిదేళ్లలో ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాలు శీఘ్రంగా ఉన్నట్లు కనిపించవచ్చు.. కానీ ఆయన చాలా కాలం క్రితం కొత్త భారతదేశం గురించి కలలు కన్నారని ఆయన డైరీలోని కొన్ని పేజీలు రుజువు చేస్తున్నాయి. శాంతిని కోరుకునే భారతదేశం. ప్రపంచ దేశాలను తన వెంట తీసుకెళ్లాలన్నారు.ప్రపంచ శాంతి దినోత్సవం ప్రత్యేక సందర్భంగా ప్రధాని మోదీ డైరీలోని కొన్ని భాగాలను పరిశీలిస్తే.. ప్రపంచానికి శాంతి పాఠం చెప్పాలనుకుంటున్నట్లు ఆయన ముందే తన డైరీలో రాసుకున్నారు. అతను తన డైరీలో.. మన స్పృహ, మన ఉనికి అనే సారాంశం – భిన్నత్వంలో ఏకత్వం అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఇలా వ్రాశారు -” దేవుడు మనందరినీ రక్షించుగాక.. కలిసి మనందరినీ పోషంచుగాక.., జాతీయ ఆకాంక్ష విషయంలో నేను ఈ జీవితాన్ని దేశ సేవకు అంకితం చేస్తున్నాను ఎందుకంటే ఇది నాది కాదు.. దేశానిది.”ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన డైరీలో మన సంప్రదాయం- కొనసాగించండి అని రాసుకున్నారు. నేను ఏ రాజ్యాన్ని కోరుకోను, స్వర్గాన్ని, పునర్జన్మను కోరను అని రాశారు. నా మాతృభూమికి నమస్కరిస్తున్నాను.ప్రస్తుత యుగం యుద్ధాలది కాదంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన శాంతి పాఠంపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్న సంగతి తెలిసిందే. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మేక్రాన్‌ మాట్లాడుతూ మోదీ వ్యాఖ్యలను ప్రస్తావించారు. ఆయన సరిగ్గా చెప్పారని కితాబిచ్చారు. ప్రస్తుత యుగం యుద్ధాలది కాదని సూచించిన భారత ప్రధాని.. ప్రపంచాన్ని ఇబ్బందిపెడుతున్న ఆహార, ఇంధన సంక్షోభాలకు వెంటనే పరిష్కార మార్గాలు కనుగొనాల్సిన ఆవశ్యకతను పుతిన్‌కు సూచించారు.‘ఈ శకం యుద్ధాల కోసం కాదు. ఈ విషయమై ఇప్పటికే మీతో ఫోన్‌లో మాట్లాడా. శాంతి మార్గంలో ఎలా పురోగతి సాధించవచ్చో అనే దానిపై చర్చించే అవకాశం నేడు లభించింది. భారత్‌- రష్యాలు దశాబ్దాలుగా పరస్పరం కలిసి ఉన్నాయి. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు, ఇతర సమస్యలపై ఆయా సందర్భాల్లో చర్చించాం. ఆహారం, ఇంధన భద్రత, ఎరువుల సమస్యల పరిష్కార మార్గాలు కనుగొందాం’ అని మోదీ అన్నారు. ‘వాణిజ్యం, ఇంధనం, రక్షణ ఇతరత్రా రంగాల్లో భారత్‌- రష్యాల సహకారాన్ని మరింత కొనసాగించే విషయమై చర్చించాం. ద్వైపాక్షిక, ప్రపంచ సమస్యలపై కూడా మాట్లాడుకున్నాం’ అని పుతిన్‌తో భేటీ అనంతరం మోదీ ట్వీట్‌ చేశారు.ప్రధాని మోదీ ఈ ప్రసంగాన్ని ప్రపంచమంతా శాంతి సందేశంగా పరిగణిస్తున్నారు. పుతిన్‌కు ప్రధాని మోదీ చెప్పిన శాంతి పాఠాలకు అమెరికా మీడియా కూడా ప్రాధాన్యతనిస్తోంది. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న అభిమాన తరంగం

Related Posts