YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రైతు వేదికల్లో రాత్రివేళల్లో అసాంఘిక కార్యకలాపాలు

రైతు వేదికల్లో రాత్రివేళల్లో అసాంఘిక కార్యకలాపాలు

నిజామాబాద్, సెప్టెంబర్ 23, 
చౌటకూర్ మండల కేంద్రంలో నిర్మించిన రైతు వేదిక భవనంలో అసాంఘిక కార్యక్రమాలతోపాటు రాత్రివేళల్లో మందుబాబులు చిందులేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం లక్షల రూపాయలు వెచ్చించి రైతుల కోసం ప్రతి మండలంలో రైతు వేదికల భవనాలను నిర్మించారు. కానీ అవి నిరుపయోగంగా ఉండడం వల్ల అట్టి భవనంలో అసాంఘిక కార్యక్రమాలతోపాటు మందుబాబులకు అడ్డగా మారింది. ఇట్టి విషయాన్ని పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ ఏ ఒక్క అధికారి పట్టించుకున్న పాపాన పోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రజాధనం వృథా అంటే ఇదేనేమో అని గ్రామస్తులు అంటున్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రవేశపెట్టిన రైతు వేదికలను అప్పజెప్పకుండా అవి నిర్మించి సుమారు సంవత్సరం గడిచినా ఇప్పటివరకు వాటి పర్యవేక్షణ చేసే నాథుడే కరువయ్యారు. ఇట్టి విషయాన్ని గ్రామ సర్పంచ్ కు వివరణ కోరగా తమ గ్రామంలో నిర్మించిన రైతు వేదిక భవనాన్ని తమకు అప్పజెప్పలేదని ఆ గ్రామ సర్పంచ్ అన్నారు. తమ తోటకూర గ్రామాన్ని కొత్త మండలంగా ప్రకటించి ఇప్పుడున్న ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు చేతులమీదుగా ప్రారంభోత్సవం చేశారు. దానికి సొంత భవనం లేకపోవడంతో ఉన్న గ్రామ పంచాయతీ భవనంలోనే మండల కార్యాలయం కొనసాగుతుంది. కానీ గ్రామపంచాయతీకి ఇకముందు ఉన్న భవనం శిథిలావస్థకు చేరింది.అరకొర సమస్యల మధ్య గ్రామ పంచాయతీ నిర్వహిస్తున్నామని గ్రామ సర్పంచ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయలు వెచ్చించి తమ గ్రామ సమీపంలో నిర్మించిన రైతు వేదికను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేవిధంగా సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు అంటున్నారు. ఆ భవనం ఇలాగే నిరుపయోగంగా ఉంటే అట్టి భవనంలో అసాంఘిక కార్యక్రమాలతోపాటు మందుబాబులకు అడ్డాగా మారిందని, ఆ భవనం వైపు ఎవరూ వెళ్లలేకపోతారని, అందువల్ల ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గ్రామపంచాయతీలో కొనసాగుతున్న మండల కార్యాలయాన్ని అట్టి భవనంలోకి మార్చాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Related Posts