YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

వ్యక్తుల కంటే వ్యవస్థలే ముఖ్యం.. రాష్ట్రపతి

వ్యక్తుల కంటే వ్యవస్థలే ముఖ్యం.. రాష్ట్రపతి

వ్యక్తుల కంటే వ్యవస్థలే ముఖ్యమని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ వ్యాఖ్యానించారు. దేశ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతినుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. రాష్ట్రపతి హోదాలో దేశ గణతంత్ర దినోత్సవాల సందర్భంగా జాతినుద్దేశించి ఆయన చేసిన తొలి ప్రసంగం ఇదే కావడం విశేషం.  భారత అత్యున్నత సంస్కృతైన ధాతృత్వాన్ని పునరుద్ధరించాలని దేశంలోని ధనవంతులకు రాష్ట్రపతి పిలుపునిచ్చారు. స్వచ్ఛందంగా తమ సంపదను పేదలకు పంచిపెట్టాలని సూచించారు. ప్రభుత్వ ప్రాధమ్యాలను వివరించిన రాష్ట్రపతి...దేశంలోని ప్రతి ఒక్కరికీ ఇళ్లు ఉండేలా దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పేదరిక నిర్మూలన చర్యలను వేగవంతం చేయాలన్నారు. దేశంలోని వ్యవస్థలు సరైన మార్గంలో నడవాలని, వ్యక్తుల కంటే వ్యవస్థలే ముఖ్యమన్న పరమార్థాన్ని గ్రహించాలన్నారు.

విద్యా వ్యవస్థలో సంస్కరణలతో పాటు ప్రమాణాల పెంపుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, రోబోటిక్స్, ఆటోమేషన్, జీనోమిక్స్‌కు అనువైన విధంగా విద్యా వ్యవస్థలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. రాయితీలను స్వచ్ఛందంగా వదులుకునేందుకు స్తోమత కలిగిన ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. 

Related Posts