YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య ప్రచ్ఛన్న యుధ్దం

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య ప్రచ్ఛన్న యుధ్దం

కల్వకుర్తి
అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల మధ్య కోల్డ్ వార్ మరోసారి రచ్చకెక్కింది.... ఒకరు ఎమ్మెల్యే మరొకరు ఎమ్మెల్సీ మధ్య వైరం  కొనసాగుకుంటూ వస్తూనే ఉండగా ఇప్పుడు  ఓ అధికారిక కార్యక్రమాల్లో ఏకంగా ఎమ్మెల్సీ నే ఆ నియోజకవర్గంలో తనపై జరుగుతున్న అవమానాలను బయటికి కక్కాడు.... అక్కడే ఉన్న ఎమ్మెల్యే తిమ్మనకుండా చూస్తుండిపోయాడు.... నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం లో ఈ సంఘటన చోటు చేసుకుంది.... నియోజకవర్గం ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి లా మధ్య గత కొంతకాలంగా వైరం కొనసాగింపు వస్తుంది... కొన్ని సందర్భాల్లో బహిరంగ అందరి కార్యకర్తల మధ్య ఘర్షణ కూడా చోటుచేసుకున్నాయి... కానీ ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్సీ  తన మాటలతో తనకు జరుగుతున్న అవమానాన్ని ఏకరువు పెడుతూ  అధికారులను హెచ్చరించాడు... ఇటువంటి అధికార కార్యక్రమాలు జరిగిన స్థానిక ఎమ్మెల్యే తో పాటు ఎమ్మెల్సీ ని కూడా ఆహ్వానించవలసి ఉంటుంది. కానీ ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ హుకుం తో ఏ కార్యక్రమానికి కూడా ఎమ్మెల్సీని ఆహ్వానించడం లేదు అధికారులు... దీంతో ఆగ్రహానికి గురవుతున్న ఎమ్మెల్సీ నిన్న నిన్న వెల్దండ మండల కేంద్రంలో మహిళా సంఘాలకు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు అధికారులు ఈ కార్యక్రమానికి కేవలం ఒక ఎమ్మెల్యే ని మాత్రమే ఆహ్వానించారు విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ కార్యక్రమానికి హాజరై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు... మహిళ అందరి సాక్షిగా పిలవని పేరంటానికి వచ్చానని.. తన హక్కులను హరిస్తూ అవమానిస్తే చూస్తూ ఊరుకునేది లేదని అధికారులను హెచ్చరించాడు. అభివృద్ధి అధికారిక కార్యక్రమాలకు తనను ఎందుకు ఆహ్వానించడం లేదని ఆవేదన వ్యక్తపరిచాడు. కేవలం ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని కమిషన్లకు కక్కుర్తి పడే బ్రోకర్ని అంతకంటే కాదని  ప్రజా ప్రతినిధుల ద్వారా ఎన్నికైన తనను ప్రభుత్వ కార్యక్రమాలకు పిలవాల్సిన పనిలేదని ప్రశ్నించాడు... ఎమ్మెల్సీ మాట్లాడుతుండగా అక్కడే ఉన్న ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ చిమ్మనకుండా చూస్తుండిపోయా.రు... ఇదంతా ఎమ్మెల్యేని దృష్టిలో పెట్టుకుని మాట్లాడాడని అందరూ గుసగుసలు అనుకుంటున్నారు...

Related Posts