YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఇండియన్‌ రేస్‌ లీగ్‌ పోటీలకు సర్వం సిద్ధం

ఇండియన్‌ రేస్‌ లీగ్‌ పోటీలకు సర్వం సిద్ధం

హైదరాబాద్, నవంబర్ 18, 
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే ఫార్ములా ఈ ఛాంపియన్‌ షిప్‌ పోటీలతో హైదరాబాద్‌ విశ్వ నగరాల జాబితాలో చేరింది. దేశంలోనే తొలిసారిగా జరుగుతున్న ఈ పోటీలకు అన్ని మెట్రో నగరాల కంటే హైదరాబాద్‌ కేంద్రంగా రేసింగ్‌ పోటీలను నిర్వహించేందుకు ఎంపిక చేశారు. దీంతో లండన్‌, ప్యారిస్‌, మొనాకో, బెర్లిన్‌ నగరాల్లోని రేస్‌ సర్క్యూట్‌ తరహాలో హైదరాబాద్‌ హుస్సేన్‌ సాగర్‌ రేసింగ్‌ ట్రాక్‌ను సిద్ధం చేశారు. ఈవీ టెక్నాలజీపై అవగాహన పెంచేందుకు ఫార్ములా ఈ రేసింగ్‌ పోటీలు కీలకంగా మారుతుందని నిర్వాహకులు, అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఫార్ములా ఈ రేసింగ్‌ పోటీలకు హుస్సేన్‌ సాగర్‌ ముస్తాబైంది. ఈ నెల 19-20న ప్రారంభమయ్యే ఇండియన్‌ రేస్‌ లీగ్‌ పోటీలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ క్రమంలో ట్రాక్‌ టెస్టింగ్‌, గ్యాలరీ, సేఫ్టీ బారికేడింగ్‌ ఏర్పాటు చేశారు. రెండ్రోజుల పాటు జరిగే ఈ పోటీలు 19న మధ్యాహ్నం 3.10 గంటలకు తొలి రేస్‌ ప్రారంభం కానుంది. పది నిమిషాల తర్వాత రెండో రేస్‌, 4గంటల నుంచి మరో 45 నిమిషాల పాటు ఇంకో లీగ్‌ జరుగుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు. బుధవారం సెక్రటేరియట్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించి పనులు చేపట్టారు. ఇప్పటికే ఇటలీకి చెందిన 14మంది సభ్యుల బృందం నగరానికి చేరుకుని ఏర్పాట్లను పర్యవేక్షించారు. కార్లు వచ్చాక డ్రైవింగ్‌ మొదలవుతుందని నిర్వాహకులు తెలిపారు. ట్రాక్‌ టెస్టింగ్‌ కోసం జరిగే ఈ పోటీల్లో 11 టీంలు బరిలో దిగనుండగా, ఇండియాకు చెందిన 10మంది రేసర్లు పాల్గొంటారని నిర్వహకులు రేసింగ్‌ ప్రమోషన్‌ వెల్లడించింది.300 కిలోమీటర్ల వేగంతో రేసింగ్‌ కార్లు దూసుకుపోయేందుకు ట్రాక్‌ను సిద్ధం చేశారు. ఫార్ములా – 1 రేసింగ్‌ ట్రాక్‌లాగా కాకుండా బ్లాక్‌ టాపింగ్‌ రోడ్లను రేస్‌ లీగ్‌ కోసం ఏర్పాటు చేశారు. మూడు వారాల వ్యవధిలో రెండు రేసుల ద్వారా ట్రాక్‌ టెస్టింగ్‌ చేసి వచ్చే ఏడాదిలో జరిగే ఫార్ములా ఈ-రేస్‌ పోటీలను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఇక రేస్‌ పోటీలను చూసేందుకు వచ్చే ప్రేక్షకులతోపాటు, సింగిల్‌ సీటింగ్‌ డ్రైవింగ్‌ విధానంలో జరిగే రేసర్ల సేఫ్టీకి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఏర్పాట్లు చేసినట్లుగా నిర్వహకులు తెలిపారు.ఎన్టీఆర్‌ మార్గ్‌లో ఇండియన్‌ రేస్‌ లీగ్‌ పోటీల నేపథ్యంలో ఈ నెల 16 రాత్రి 10 గంటల నుంచి ఈ నెల 20 రాత్రి 10 గంటల వరకు వివిధ కూడళ్లలో హుస్సేన్‌సాగర్‌ పరిసరాలలో ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నట్లు నగర ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ రంగనాథ్‌ తెలిపారు. ఈ రేస్‌ల కారణంగా ఎన్టీఆర్‌ గార్డెన్‌, ఎన్టీఆర్‌ ఘాట్‌, నెక్లస్‌ రోడ్డు, లుంబినీ పార్కు 18 నుంచి 20వ తేదీ వరకు మూసివేస్తారని తెలిపారు.అఫ్జల్‌గంజ్‌ నుంచి ట్యాంక్‌బండ్‌ మీదుగా సికింద్రాబాద్‌ వైపు వెళ్లే వాహనాలు, తెలుగు తల్లి ైప్లెఓవర్‌, కట్టమైసమ్మ, లోయర్‌ ట్యాంక్‌బండ్‌, డీబీఆర్‌ మిల్స్‌, కవాడిగూడ రూట్లలోకి మళ్లిస్తారు. పీవీ విగ్రహం (ఖైరతాబాద్‌) వైపు నుంచి నెక్లస్‌ రోటరీ వైపు ట్రాఫిక్‌ అనుమతి లేదు, పీవీ విగ్రహం వద్ద సాదన్‌ కాలేజ్‌, రవీంద్రభారతి వైపు మళ్లిస్తారు.
బుద్ధభవన్‌, నల్లంపట్ట జంక్షన్‌ నుంచి నెక్లస్‌ రోటరీ వైపు వాహనాలకు అనుమతి లేదు. ఈ వాహనాలను నల్లగుట్ట జంక్షన్‌ నుంచి రాణిగంజ్‌, ట్యాంక్‌బండ్‌ వైపు మళ్లిస్తారు.
రసూల్‌పురా, మినిస్టర్‌ రోడ్డు నుంచి నెక్లస్‌ రోటరీ వైపు నల్లగుట్ట మీదుగా వచ్చే వాహనాలను, నల్లగుట్ట జంక్షన్‌ వద్ద రాణిగంజ్‌ వైపు మళ్లిస్తారు.
ఇక్బాల్‌ మినార్‌ నుంచి తెలుగు తల్లి జంక్షన్‌, ట్యాంక్‌ బండ్‌ వైపు వాహనాలకు అనుమతి లేదు. ఈ వాహనాలను ైప్లెఓవర్‌ పై నుంచి కట్టమైసమ్మ ఆలయం, లోయర్‌ ట్యాంక్‌బండ్‌ వైపు వెళ్లాలి.
ట్యాంక్‌బండ్‌, తెలుగుతల్లి నుంచి నెక్లస్‌ రోటరీ వైపు వాహనాలకు అనుమతి లేదు. తెలుగు తల్లి జంక్షన్‌ నుంచి ఇక్బాల్‌ మినార్‌, రవీంద్ర భారతి జంక్షన్‌ వైపు వెళ్లాలి.
బీఆర్‌కేఆర్‌ భవన్‌ నుంచి నెక్లెస్‌ రోటరీ వైపు వచ్చే వాహనాలను తెలుగుతల్లి జంక్షన్‌ నుంచి ఇక్బాల్‌మినార్‌, రవీంద్ర భారతి జంక్షన్‌కు మళ్లిస్తారు.
ఇక్బాల్‌ మినార్‌ జంక్షన్‌ నుంచి మింట్‌కంపౌండ్‌ వైపు వాహనాలను అనుమతి లేదు. ఈ వాహనాలను రవీంద్ర భారతి జంక్షన్‌ వైపు మళ్లిస్తారు.
ఖైరతాబాద్‌ బడా గణేశ్‌ వైపు నుంచి ప్రింటింగ్‌ ప్రెస్‌, నెక్లస్‌ రోటరీ వైపు వాహనాలకు అనుమతి లేదు. ఈ వాహనాలను బడాగణేశ్‌ వద్ద రాజ్‌దూత్‌ లైన్‌లోకి మళ్లిస్తారు.

Related Posts