YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మంధనిలో హీటెక్కిన పాలిటిక్స్

మంధనిలో హీటెక్కిన పాలిటిక్స్

కరీంనగర్, నవంబర్ 22, 
తెలంగాణ సార్వత్రిక ఎన్నికల ముందు, మునుగోడు ఫలితాల తర్వాత పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గ రాజకీయాలు మరొక్కసారి హీటెక్కిస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది మంథని రాజకీయాలు మరింత ముదురుతున్నాయి. ఒకరిపై మరొకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్న వైనం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మొన్నటికి మొన్న పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు ఢిల్లీ వెళ్తే బీజేపీలోకి వెళ్తున్నట్టూ పుకార్లు షికారు అయ్యాయి. దీనిపై స్పందించిన పుట్ట మధు తాను మరే పార్టీలోకి వెళ్లట్లేదని ప్రకటించారు. కావాలానే కొందరు నాయకులు పుట్ట మధును అభాసుపాలు చేయడానికే ఫేక్ వార్తలు సృష్టించారని ఆయన ఆరోపించారు. అనంతరం టీఆర్ఎస్ నాయకులు సైతం మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, ఆయన సోదరుడు శ్రీను బాబు మధ్య విభేదాలు తలెత్తయాని ప్రచారం చేస్తున్నారు. గతంలోనే శ్రీను బాబు టిక్కెట్ కోసం ప్రయత్నించాడని, ఇప్పుడు రానున్న ఎన్నికల్లో మంథని టిక్కెట్ గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాడనేది ఇందులోని సారాంశం.దీనిపై మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు సోదరుడు శ్రీను బాబు స్పందించినట్లు ఒక ఆడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతుండడం విశేషం. మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మల్కాజ్ గిరి నుండి పోటీ చేయబోతున్నాడని, ప్రస్తుత పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకు టీఆర్ఎస్ టికెట్ అనుమానేనని దీంతో ఆయన మరో పార్టీ నుంచి టికెట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నాడని వార్తలు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రాజకీయ ఎత్తుగడలో భాగంగా ప్రజలను తప్పుదోవ పట్టించడానికే ఇరు పార్టీలు ప్రయత్నిస్తున్నాయని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు వ్యక్తిగతంగా స్పందించి వివరణ ఇస్తే కాని ఈ ప్రచారానికి ఇప్పట్లో ముగింపు కనిపించట్లేదు..పదవుల కోసం ఏనాడు దుద్దిళ్ల కుటుంబం ఆశపడలేదని అందరూ గుర్తుంచుకోవాలి. మిగత వారిలా పదవుల కోసం ఏనాడు కొట్లాడలేదు. మంచి చేస్తే ప్రజలే నిర్ణయిస్తారని, ఆ విషయాన్ని అందరూ గమనించుకోవాలి. ప్రజలా నిర్ణయాన్ని అందరూ శిరసా వహించాలి. జర్నలిస్టులు కూడా పత్రిక విలువల్ని అనుకరించి సరైన వార్తలు రాయాలి.శ్రీను బాబుకు సంబంధించిన ఆడియో వైరల్ అవుతున్న నేపథ్యంలో దానికి వారే సమాధానం చెప్పాలి. పుట్ట మధుకు సంబంధించి అసత్యాల్ని ప్రచారం చేస్తున్నారు. వార్తలు రాసిన విలేకరులపై ఇష్టారీతిన వ్యవహరించడం కరెక్ట్ కాదని వాపోతున్నారు

Related Posts