YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఖమ్మంలో క్లీన్ స్వీప్ సాధ్యమేనా

ఖమ్మంలో క్లీన్ స్వీప్ సాధ్యమేనా

ఖమ్మం, నవంబర్ 22, 
తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ఏ మాత్రం కలిసిరాని జిల్లా ఏదైనా ఉందంటే అది ఉమ్మడి ఖమ్మం జిల్లా మాత్రమే..రాష్ట్రంలో మిగతా అన్నీ జిల్లాల్లో టీఆర్ఎస్ పార్టీకి ఆధిక్యం ఉంది..కానీ ఖమ్మంలో చాలా తక్కువ. గత రెండు ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చారు గాని..ఖమ్మంలో మాత్రం సత్తా చాటలేకపోయారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 10 సీట్లు ఉంటే..గత ఎన్నికల్లో కేవలం ఒక్క ఖమ్మం అసెంబ్లీ మాత్రమే తక్కువ మెజారిటీతో టీఆర్ఎస్ గెలిచింది.మిగిలిన 9 చోట్ల ఓడిపోయింది. కాంగ్రెస్ 6, టీడీపీ 2, ఇండిపెండెంట్ ఒకటి గెలుచుకున్నారు. అయితే ఆ తర్వాత అధికారంలో ఉండటంతో ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టి..నలుగురు కాంగ్రెస్, ఇద్దరు టీడీపీ, ఒక ఇండిపెండేట్ ఎమ్మెల్యేని టీఆర్ఎస్‌ లాక్కుంది. అంటే టీఆర్ఎస్‌కు 8, కాంగ్రెస్‌కు 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ విధంగా టీఆర్ఎస్ ఆధిక్యంలోకి వచ్చింది. అయితే వచ్చే ఎన్నికల్లో జిల్లాలో పదికి పది సీట్లు గెలవాలని జిల్లా గులాబీ నేతలు టార్గెట్ గా పెట్టుకున్నారు.అందుకే ఈ జిల్లాపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్ చేసి పనిచేస్తున్నారు..ఎమ్మెల్సీలు ఇచ్చారు..రెండు రాజ్యసభ పదవులు ఇచ్చారు. బండి పార్థసారథి రెడ్డి, వద్దిరాజు రవిచంద్రలకు రాజ్యసభ ఇచ్చారు. తాజాగా పదవులు చేపట్టాక జిల్లాకు వస్తున్న సందర్భంగా అభినందన సభ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే వీరయ్య, జిల్లా అధ్యక్షుడు తాతా మధు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా, జిల్లాకు చెందిన నేతలంతా హాజరయ్యారు.ఈ క్రమంలో నెక్స్ట్ ఎన్నికల్లో జిల్లాని క్లీన్ స్వీప్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. అయితే అంత ఈజీగా జిల్లాలో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేయడం కష్టమైన పని..కమ్యూనిస్టులతో పొత్తు కలిసొస్తుంది గాని స్వీప్ కష్టం. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ స్ట్రాంగ్ గా ఉంది..అటు బీజేపీ బలపడాలని చూస్తుంది. కొద్దోగొప్పో టీడీపీకి బలం ఉంది. షర్మిల పార్టీ ఉంది. అలాంటప్పుడు ఖమ్మంలో కారు క్లీన్ స్వీప్ చేయడం జరిగే పని కాదు.

Related Posts