YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

లిక్కర్ స్కామ్ లో 10 వేల పేజీల చార్జీ షీటు

లిక్కర్ స్కామ్ లో 10 వేల పేజీల చార్జీ షీటు

న్యూఢిల్లీ, నవంబర్ 26, 
లిక్కర్ స్కామ్ లో సీబీఐ తొలి ఛార్జ్ షీట్.. పదివేల పేజీల ఛార్జ్ షీట్‌లో.. ఏడుగురు నిందితులతో కూడిన పేర్లు. ఈ నెల ముప్పైకి విచారణ వాయిదా. ఇదీ లిక్కర్ స్కామ్ లేటెస్ట్ అప్ డేట్.. ఈ ఛార్జ్ షీట్ కు సాక్ష్యులు ఇచ్చిన సమాచారాన్ని ఇతర ఆధారాలను సైతం జత జరిచింది సీబీఐ. అయితే సీఎఫ్ఎస్ఎల్‌కు పంపిన వస్తువుల రిపోర్ట్ ఇంకా రావల్సి ఉంది. ఈ వివరాలు ఇలా ఉంటే.. ఏడుగురు నిందితుల్లో ఇప్పటి వరకూ విజయ్ నాయర్, అభిషేక్ లను మాత్రమే అరెస్టు చేసింది సీబీఐ. అయితే వీరికి కోర్టు బెయిలు ఇవ్వడం గమనార్హం. మిగిలిన ఐదుగురు నిందితులను ఇంకా అరెస్టు చేయాల్సి ఉందని తెలిపింది. ఢిల్లీ లిక్కర్ కేసులోని ఏడుగురు నిందితుల్లో.. ఏ-1 గా ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ అసిస్టెంట్ కమిషనర్ నరేంద్ర సింగ్ కాగా. ఏ-2గా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కుల్ దీప్ సింగ్, ఏ- 3గా విజయ్ నాయర్, ఏ- 4 గా అభిషేక్ బోయిన్ పల్లి పేర్లను రాసింది. సమీర్ మహేంద్రు, అరుణ్ రామచంత్ర పిళ్లై, ముత్తా గౌతమ్ పేర్లను సైతం తన చార్జ్ షీట్ లో పేర్కొంది సీబీఐ. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీబీఐ 2022 నవంబర్ 25 శుక్రవారం ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. మొత్తం 7గురిపై ఈ ఛార్జిషీటు దాఖలైంది. ఢిల్లీలోని రోస్ అవెన్యూ కోర్టులో సీబీఐ ఈ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కోర్టులో ఎక్సైజ్ పాలసీ స్కామ్ విచారణ జరుగుతోంది. ఛార్జ్ షీట్ దాఖలైన 7గురిలో ముగ్గురు ప్రభుత్వోద్యోగులని సీబీఐ కోర్టుకు తెలిపింది. ఈ కేసులో ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై ఇంకా విచారణ కొనసాగుతోందని సీబీఐ కూడా కోర్టుకు తెలిపింది. విజయ్‌ నాయర్‌, అభిషేక్‌ బోయిన్‌పల్లి, సమీర్‌ మహేంద్రు, ముత్తాత గౌతమ్‌, అరుణ్‌ ఆర్‌ పిళ్లై అనే 7గురిపై ఫిర్యాదు చేశారు. దీంతో పాటు ఇద్దరు మాజీ ఎక్సైజ్ అధికారులపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది.ప్రభుత్వ అధికారులను ప్రాసిక్యూట్ చేసేందుకు ప్రభుత్వ అనుమతులను సైతం తీసుకుంది దర్యాప్తు సంస్థ. అందులో భాగంగా.. కేసు దర్యాప్తు కొనసాగుతున్నట్టు చెప్పింది సీబీఐ. మొత్తంగా తదుపరి విచారణ నవంబర్ 30కి వాయిదా పడింది. సీబీఐ దాఖలు చేసిన చార్జ్ షీట్ ఆమోదించాలో వద్దో ఈ నెల ముప్పైన నిర్ణయించనుంది రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టు. ఫైనల్ గా చూస్తే.. మనీష్ సిసోడియా పేరును ప్రస్తుతానికి తన చార్జ్ షీట్ లో పొందుపరచలేదు సీబీఐ.ఈ చార్జిషీట్‌లో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పేరు లేకపోవడం విశేషం. ఇప్పుడు ఈ చార్జిషీటుపై కోర్టులో విచారణ జరగనుంది. అరెస్టయిన ఇద్దరు వ్యాపారవేత్తలు, న్యూస్ ఛానల్ అధినేత, హైదరాబాద్‌లో నివాసముంటున్న మద్యం వ్యాపారి, ఢిల్లీలో నివాసముంటున్న మద్యం పంపిణీదారు, ఎక్సైజ్ శాఖకు చెందిన ఇద్దరు అధికారులు చార్జిషీట్‌లో ఉన్నట్లు సీబీఐ పేర్కొంది. ఏజెన్సీ విచారణ ఇంకా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. సిబిఐ 10,000 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇప్పుడు రూస్ అవెన్యూ కోర్టు కేసులో తదుపరి విచారణ నవంబర్ 30 న జరుగుతుంది. సిబిఐ ఛార్జ్ షీట్‌ను పరిగణనలోకి తీసుకోవడంపై కోర్టులో చర్చ జరుగుతుంది.

Related Posts