YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

టార్గెట్ 2023 రాజకీయాలు

టార్గెట్ 2023 రాజకీయాలు

కరీంనగర్, డిసెంబర్ 9, 
ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాలపై మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించినట్టుగా స్పష్టం అవుతోంది. ఇంత కాలం తను ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్లకు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చిన ఆయన ఇతర సెగ్మెంట్లలో అడపాదడపా జరిగే కార్యక్రమాలకు మాత్రమే హాజరయ్యారు. జిల్లా రాజకీయాలపై పెద్దగా దృష్టి సారించని ఆయన ఇప్పుడు సీరియస్‎గానే నజర్ వేస్తున్నట్టుగా తెలుస్తోంది. తను పర్యవేక్షించే శాఖల అంశాలకు మాత్రమే ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చి ఆ దిశగా మాత్రమే ముందుకు సాగే వారు. ఎన్నికల విషయంలోనూ నేరుగా సమీకరణాలు జరిపిన సంఘటనలు తక్కువేనని చెప్పాలి. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో ఆయన సీరియస్‎గా పావులు కదుపుతుండడంతో ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో తన మార్క్ పాలిట్రిక్స్ ప్రారంభించారని అర్థం అవుతోంది.స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పర్వం నుండి మంత్రి కేటీఆర్ జిల్లా రాజకీయాలను ఎక్కువగా పట్టించుకుంటున్నారు. ఎన్నికల్లో నామినేషన్లు వేసిన వారితో మాట్లాడి పోటీ నుండి తప్పించేందుకు ఒప్పించారు. కొంతమందితో వ్యక్తిగతంగా మాట్లాడిన కేటీఆర్ ఫోన్ ద్వారా కూడా మంతనాలు జరిపి సఫలం అయ్యారు. ఈ సందర్భంగా పోటీ చేసేందుకు ఉత్సాహం చూపిన వారితో వివరంగా మాట్లాడిన కేటీఆర్ అన్ని విషయాలను క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గాల్లో నెలకొన్న పరిస్థితులపై కూడా అవగాహన పెంచుకున్నట్టుగా తెలుస్తోంది. నామినేషన్ల ఉప సంహరణ తరువాత అంటీముట్టనట్టుగానే వ్యవహరించిన కేటీఆర్ పోలింగ్ తేదీ సమీపించగానే స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో వ్యక్తిగతంగా కలిసే ప్రయత్నం చేస్తున్నారు. నియోజకవర్గాల వారిగా సమావేశాలు ఏర్పాటు చేసిన ఆయన ఆయా ప్రాంతాల్లోని ప్రజా ప్రతినిధులతో వ్యక్తిగత పరిచయాలు పెంచుకునేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా స్పష్టం అవుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు గెలవాలన్న లక్ష్యంతోనే ఈ సమావేశాలు ఏర్పాటు చేసినప్పటికీ ఆయన ప్రజా ప్రతినిధులతో మాట్లాడుతున్న తీరు, వారిని ఆకర్షించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఆయన సీరియస్ నెస్‌ను స్పష్టం చేస్తున్నాయి

Related Posts