YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కారులో కలవరం...

కారులో కలవరం...

హైదరాబాద్, డిసెంబర్ 9, 
మునుగోడు ఉపఎన్నిక, ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, ఐటీ, ఈడీ దాడులు నేపథ్యంలో తెలంగాణలో రాజకీయాలు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా జరిగాయి. ఇటీవల షర్మిల రాజకీయం మరో మలుపు తిప్పింది. ఇలాంటి రాజకీయ రచ్చ నడుస్తుండగానే..టీఆర్ఎస్‌లో సొంత రచ్చ కూడా ఎక్కువైంది. ఆ మధ్య ఈ ఆధిపత్య పోరు బాగా కనిపించింది. ఆ తర్వాత మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో కాస్త కనబడలేదు.మళ్ళీ ఇప్పుడు రచ్చ షురూ అయింది. తాజాగా మంత్రి నిరంజన్ రెడ్డి, జెడ్పీ ఛైర్మన్ లోక్ నాథ్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం నడిచింది. నిధుల ఖర్చు వ్యవహారంలో ఇరువురి మధ్య వార్ నడిచింది. ఇక ఎప్పటిలాగానే స్టేషన్ ఘనపూర్ స్థానంలో ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరిల మధ్య రచ్చ జరిగింది. దళితబంధు పథకం విషయంలో కడియం..పరోక్షంగా రాజయ్యపై విమర్శలు చేశారు. కొందరు ప్రజాప్రతినిధులు..సొంత బంధువులకు, డబ్బులు ఇచ్చిన వారికే దళితబంధు ఇస్తున్నారని ఫైర్ అయ్యారు.దీనికి రాజయ్య కౌంటర్ ఇస్తూ..కొందరు నేతలు చిల్లర మాటలు మాట్లాడుతున్నారని, అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఇలా వీరి మధ్య రచ్చ నడుస్తోంది. అటు మహేశ్వరంలో మంత్రి సబితా, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డిల మధ్య వార్ నడుస్తోంది.ఇదిలా ఉంటే కొల్లాపూర్‌లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు అన్నీ దారులు తెరిచే ఉన్నాయని మాట్లాడారు. ఇక తాజాగా తెలంగాణ ఉద్యమ సమయంలో ఆనాడు కలిసి పనిచేసిన నేతలతో సమావేశమయ్యారు. గతంలో జూపల్లి కాంగ్రెస్ లో పనిచేసిన విషయం తెలిసిందే.ఇప్పుడు మళ్ళీ గత నేతల్ని కలవడంతో..జూపల్లి కాంగ్రెస్‌లోకి వెళ్తారని ప్రచారం వస్తుంది. ఎలాగో సిట్టింగులకే సీటు అని కేసీఆర్ అన్నారు. దీంతో కొల్లాపూర్ సీటు హర్షవర్ధన్ రెడ్డికే దక్కుతుంది. దీంతో జూపల్లి వేరే దారి చూసుకునే ఛాన్స్ ఉంది. అలా అని బీజేపీలోకి వెళ్ళడం కష్టం..అక్కడ తన చిరకాల శత్రువు డీకే అరుణ ఉన్నారు. మరి జూపల్లి ఎటు వెళ్తారో చూడాలి.

Related Posts