
ఫైనల్ లోకి ప్రవేసించిన చెన్నై సూపర్ కింగ్స్. నిన్న జరిగిన మ్యాచ్ల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫై రెండు వికెట్లు తేడా తో చెన్నై గెలిచింది. డుప్లెసిస్ (42 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 67 నాటౌట్) అసాధారణ బ్యాటింగ్‌తో చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్-11 ఫైనల్లోకి ప్రవేశించింది. ఇతడి ఆటతీరుతో విజయంపై ఆశలు లేని స్థితిలో నుంచి తేరుకున్న చెన్నై రెండు వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌పై నెగ్గింది. ఆఖర్లో శార్దుల్ ఠాకూర్ (5 బంతుల్లో 3 ఫోర్లతో 15 నాటౌట్) విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 139 పరుగులు చేసింది. బ్రాత్‌వైట్ (29 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సర్లతో 43 నాటౌట్) చెలరేగాడు. విలియమ్సన్ (15 బంతుల్లో 4 ఫోర్లతో 24), యూసుఫ్ పఠాన్ (29 బంతుల్లో 3 ఫోర్లతో 24) ఫర్వాలేదనిపించారు. బ్రావో రెండు వికెట్లు తీశాడు. ఆ తర్వాత లక్ష్యం కోసం బరిలోకి దిగిన చెన్నై 19.1 ఓవర్లలో 8 వికెట్లకు 140 పరుగులు చేసింది. రైనా (13 బంతుల్లో 4 ఫోర్లతో 22) ఫర్వాలేదనిపించాడు. సిద్ధార్థ్ కౌల్, రషీద్ ఖాన్, సందీప్ శర్మలకు రెండేసి వికెట్లు పడగొట్టారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ డుప్లెసి్‌సకు దక్కింది.