YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

సుకన్యా, బేటీ బచావో తో పెరిగిన బాలికల అక్షరాస్యత

సుకన్యా, బేటీ బచావో తో పెరిగిన బాలికల అక్షరాస్యత

న్యూఢిల్లీ, జనవరి 23, 
దేశంలో గత దశాబ్ద కాలంగా ఏటా 60 కంటే తక్కువ విద్యార్థులు చేరుతున్న ప్రభుత్వ పాఠశాలల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. అసర్ (యాన్యువల్‌ స్టేటస్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రిపోర్ట్‌) నివేదికలో ఈ విషయం వెల్లడైంది. దేశంలో గల అయిదేళ్ల చిన్నారుల్లో మూడింట ఒకవంతు మంది ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతి కంటే తక్కువ తరగతిలోనే చదువుతున్నారు. నూతన విద్యా విధానం ప్రకారం దేశంలో 1వ తరగతిలో చేరడానికి చిన్నారులకు కనిష్ఠంగా ఆరేళ్ల వయసు వచ్చి ఉండాలి.2022లో చిన్న పాఠశాలలు ఎక్కువగా హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో ఉన్నాయి. వాటి సంఖ్య ఉత్తర్‌ప్రదేశ్‌లో 2018లో 10.4% నుంచి 2022లో 7.9%కు, కేరళలో 2018లో 24.1%నుంచి 2022లో 16.2%కు తగ్గింది. తొలి అసర్‌ సర్వే 2005లో జరిగింది. అప్పట్నుంచి పదేళ్ల పాటు ఏటా నిర్వహించారు. మళ్లీ నాలుగేళ్ల తర్వాత 2022లో తొలిసారిగా క్షేత్రస్థాయి ప్రాథమిక సర్వే చేశారు. కొవిడ్ మహమ్మారి కారణంగా పాఠశాలలు మూసేసిన తర్వాత మళ్లీ ఇప్పుడే విద్యార్థులు వస్తుండటంతో ఈ సర్వే ప్రాధాన్యం సంతరించుకుంది.ఇందులో భాగంగా 19,060 గ్రామాల్లోని 3,74,544 కుటుంబాల్లో 3 నుంచి 16 సంవత్సరాల మధ్య వయసున్న 6,99,597 మంది పిల్లలను పరిశీలించారు. 2018 స్థాయి కంటే విద్యాహక్కు చట్టంలోని సూచికలన్నింటిలో దేశవ్యాప్తంగా కొంత మెరుగుదల కనిపించింది.2018లో బాలికలు ఉపయోగించగల మరుగుదొడ్లు 66.4% ఉండగా, అది 2022లో 68.4%కు పెరిగింది. అలాగే తాగునీటి సదుపాయం 74.8% నుంచి 76%కు పెరిగింది. పాఠ్యపుస్తకాలే కాక, ఇతర పుస్తకాలున్న పాఠశాలల సంఖ్య 36.9% నుంచి 44%కు పెరిగింది. అయితే రాష్ట్రాల వారీగా ఈ గణాంకాల్లో తేడాలున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో తాగునీరు అందుబాటులో ఉన్న పాఠశాలల సంఖ్య 2018లో 58.1% నుంచి 2022 నాటికి 65.6%కు పెరిగింది.
అరుణాచల్ ప్రదేశ్‌లో గత 15 ఏళ్లలో పాఠశాలల్లో పిల్లల చేరిక పెరిగింది. 2018లో ఇది 97.2% ఉండగా, 2022లో 98.4% ఉంది. ప్రథమ్ ఫౌండేషన్ కారణంగా ఇక్కడి అభ్యసన ఫలితాలు మెరుగుపడ్డాయి.సుకన్యా సమృద్ధి యోజన, బేటీ బచావో బేటీ పఢావో లాంటి కార్యక్రమాలతో పాఠశాలల్లో బాలికల చేరిక కూడా పెరిగింది. కానీ... ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో అయిదో తరగతి పిల్లలు తీసివేతలు చేయగల సామర్థ్యం 2018లో 27.1% ఉండగా, 2022లో 22.9%కు తగ్గింది. ఎనిమిదో తరగతిలోనూ తీసివేతలు చేసే సామర్థ్యం 2018లో 49.3% నుంచి 2022లో 45.9%కు తగ్గింది. సాధారణ ఇంగ్లిషు వాక్యాలు చదివే సామర్థ్యం అరుణాచల్ ప్రదేశ్‌లో కొద్దిగా పెరిగింది.

Related Posts