YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మంథనిలో కాంగ్రెస్ నాయకుల అరెస్టులు

మంథనిలో కాంగ్రెస్ నాయకుల అరెస్టులు

మంథని
మంథని పట్టణంలోని పోచమ్మ వాడలో ప్రభుత్వం పేద ప్రజల కోసం ప్రతిష్టాత్మకంగా  నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను సోమవారం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభోత్సవం చేస్తున్న సందర్భంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులలో అనర్హులను ఎంపిక చేశారని అర్హులైన వారికి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ధర్నా కు పిలుపు నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు సోమవారం తెల్లవారుజామునుండే అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. పోలీసులు  మంథని మండల అధ్యక్షులు సెగ్గం రాజేష్ , మంథని మున్సిపల్ అధ్యక్షులు పొలు శివ, కాంగ్రెస్ నాయకులు లైషేట్టి రాజు, పెంటరి రాజు,మంథని సురేష్, మంథని రాకేష్, అబ్దుల్ అలీం,పెరుగు తేజ, గాజుల నిఖిల్, నరేడ్ల ఒదేలు, ఇందారపు అనిల్, శెట్టి సతీష్ లను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అరెస్టు అయిన సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సెగ్గం రాజేష్, మున్సిపల్  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోలు శివ లు మాట్లాడుతూ ఎన్ని అరెస్టులు చేసిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అనర్హులకు కేటాయిస్తే మేము ఊరుకునేది లేదని హెచ్చరించారు. మంథని ఎమ్మెల్యే  దుద్దిళ్ళ శ్రీధర్ బాబు  ఇప్పటికీ చాలా సార్లు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి డబల్ బెడ్ రూమ్ ఇండ్ల జబితాలో నిజమైన అర్హులైన వారినీ గుర్తించాలని చెప్పిన ఇప్పటివరకు అర్హులను ఎంపిక చేయక  స్థానిక ఎమ్మెల్యే కు ఎలాంటి సమాచారం  ఇవ్వకుండా దొడ్డి దారిన ప్రారంభోత్సవ  కార్యక్రమం చేయడం బిఆర్ఎస్ పార్టీది సరైన విధానం కాదన్నారు. మంథని మున్సిపల్ పరిధిలోని గత ఎనిమిది సంవత్సరాల క్రితం ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కాలయాపన చేసి ఈరోజు  రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్  ప్రారంభించే ఇండ్లను అర్హులకు  కేటాయించాలని కోరితే అక్రమంగా  ఎక్కడివారిని అక్కడ తెల్లవారుజామున  అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం భావ్యం కాదన్నారు. మంథని లో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లు అనర్హులకు  కేటాయిస్తే ఊరుకునేది లేదని  కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంథని ఎమ్మెల్యే, ఎఐసిసి కార్యదర్శి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు  పిలుపు మేరకు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించారు.

Related Posts