YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రవిశంకర్ కు తప్పిన ముప్పు

రవిశంకర్ కు తప్పిన ముప్పు

బెంగళూరు, జనవరి 25, 
ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ గురు శ్రీ శ్రీ రవిశంకర్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. శ్రీ శీ రవిశంకర్‌ ప్రయాణం చేస్తున్న చాపర్‌ ఎమర్జెన్స ల్యాండింగ్‌ అయ్యింది. తమిళనాడు లోని ఈరోడ్‌ జిల్లా సత్యమంగంళం అటవీప్రాంతంలో చాపర్‌ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ అయ్యింది. వాతావరణం అనుకూలించకపోవడంతో చాపర్‌ను ల్యాండ్‌ చేశారు. ఈరోడ్జిల్లా సత్యమంగళం టైగర్ రిజర్వ్ పరిధిలోని కడంపూర్ హిల్స్ గ్రామం ఉగిన్యాంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఈరోజు ఉదయం సరిగ్గా 10.30 గంటలకు హెలికాప్టర్ అకస్మాత్తుగా అత్యవసరంగా ల్యాండ్ అయింది. హెలికాప్టర్ ఒక్కసారిగా ల్యాండ్ కావడంతో ఆ ప్రాంత ప్రజలు అయోమయంలో పడ్డారు.బెంగళూరు నుంచి తిరుపూర్ వెళ్లే హెలికాప్టర్‌లో ప్రతికూల వాతావరణం నెలకొంది. అలాగే దట్టమైన పొగమంచు కారణంగా మార్గం స్పష్టంగా లేకపోవడంతో హడావుడిగా ల్యాండింగ్ చేశారు.ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ సహా నలుగురు హెలికాప్టర్‌లో వెళ్లారు. 1 గంట పాటు అక్కడ వేచి ఉన్న తర్వాత వాతావరణం తేలికైన తర్వాత రవిశంకర్, అతని సహాయకులు ఉగినియం గ్రామం నుంచి తిరిగి హెలికాప్టర్‌లో బయలుదేరారు

Related Posts