YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

అక్కినేని కుటుంబానికి బాలకృష్ణ క్షమాపణ చెప్పాలి

అక్కినేని కుటుంబానికి బాలకృష్ణ క్షమాపణ చెప్పాలి

నెల్లూరు
భారతీయ సంస్కృతికి అద్దం పట్టిన విధంగా ఎంతో ఉన్నతమైన కుటుంబానికి చెందిన అక్కినేని కుటుంబంపై నోటి దుడుకు బాలకృష్ణ నోటు దృష్టితో అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం తగదని నెల్లూరు జిల్లా అక్కినేని మరియు నాగార్జున ఫ్యాన్స్ డిమాండ్ చేశారు. నెల్లూరు నగరంలోని స్థానిక నర్తకి సెంటర్లో అక్కినేని కుటుంబం పై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా అక్కినేని అభిమానులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివాదాలు దూరంగా ఉన్న అక్కినేని కుటుంబాన్ని అనవసరమైన వివాదాలకు లాగడం తగదని బాలకృష్ణకు హెచ్చరికలు జారీ చేశారు. సినిమా షూటింగ్లలోను వివిధ ఫంక్షలలోను తప్ప తాగి చిందులేస్తూ తాను ఏం మాట్లాడతా మాట్లాడుతున్నాడో తెలియని స్థితిలో ఉన్నటువంటి నీచ బాలయ్య లాగా అక్కినేని కుటుంబీకులు ప్రవర్తించారని ఈ విషయాన్ని బాలకృష్ణ గుర్తుంచుకోవాలని సూచించారు. అక్కినేని కుటుంబ సభ్యులకు బాలకృష్ణ క్షమాపణ చెప్పకుంటే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సందర్భంగా నీచ బాలయ్య అంటూ బాలకృష్ణ ఫ్లెక్సీలను తగులు పెట్టారు. ఈ కార్యక్రమంలో అక్కినేని నాగ్ ఫాన్స్ జిల్లా అధ్యక్షులు ఎన్ మధు, గ్రేట్ ఇండియా ఎం. సాయి కుమార్, నాగార్జున అభిమాని మరియు నెల్లూరు 13వ డివిజన్ కార్పొరేటర్ ఊట్కూరు నాగార్జున, నాగూరు, నాగార్జున రెడ్డి, చుక్కల బాబు, రమేష్, మధు ,రమణ ,సందీప్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts