YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1,

ధరలు తగ్గేవి... పెరిగేవి :
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వేతన జీవులకు ఊరటనిచ్చారు. పాత ట్యాక్స్‌ సిస్టమ్‌కి స్వస్తి పలికి కొత్త విధానం తీసుకొచ్చారు. ఇదే సమయంలో ఏయే వస్తువుల ధరలు పెరుగనున్నాయి, తగ్గనున్నాయో కూడా వెల్లడించారు. ఆ లిస్ట్ ఓ సారి చూద్దాం.
ధరలు తగ్గేవి
. మొబైల్ ఫోన్స్, కెమెరా లెన్స్
. విదేశాల నుంచి వచ్చే వెండి
. టీవీలు, బయోగ్యాస్
. టీవీ విడిభాగాలపై కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు
. విద్యుత్ వాహనాలు, బొమ్మలు, సైకిళ్లు
ధరలు పెరిగేవి
. బంగారం, వెండి, ప్లాటినంపై కస్టమ్స్ డ్యూటీ పెంపు
. సిగరెట్లపై కస్టమ్స్ డ్యూటీ 16% వరకూ పెంపు
.టైర్లు, బ్రాండెడ్ దుస్తులు, కిచెన్ చిమ్నీలు

రైతాంగానికి పెద్దపీట :
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సాధారణ బడ్జెట్-2023ను ప్రవేశపెట్టారు. 2023 బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి.. రైతుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రైతుల ఆదాయాన్ని పెంచేందుకు అనేక చర్యలు తీసుకున్నారు. కిసాన్ సమృద్ధి యోజన తర్వాత ఈ సంవత్సరం ప్రభుత్వం అనేక ఇతర పథకాలను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. పశు పోషకులు, మత్స్యకారుల కోసం బీజేపీ సర్కారు అనేక చర్యలు తీసుకుంది. సార్వత్రిక బడ్జెట్ ప్రసంగం సందర్భంగా.. ఆర్థిక మంత్రి సహకారంతో రైతుల కోసం అభ్యుదయ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రకటించారు. దీని ద్వారా 63000 అగ్రి సొసైటీలను కంప్యూటరీకరిస్తారు. ఇది రైతులు అభివృద్ధి చెందడానికి దోహదపడుతుంది. దీంతో పాటు పశుసంవర్ధక, మత్స్య, మల్టీపర్పస్ కార్పొరేట్ సొసైటీల్లో రుణాల మంజూరులో వేగం పెంచుతామని ప్రకటించింది. దీనితో పాటు ప్రధాన మంత్రి మత్స్య పాలన్ యోజనను కూడా ప్రారంభించాలని ఆర్థిక మంత్రి నిర్ణయించారు. అదే సమయంలో డిజిటల్ టెక్నాలజీ ద్వారా వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని కూడా సర్కారు చూస్తోంది. బుధవారం ప్రవేశపెట్టిన 2022-23 ఆర్థిక బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ భారతదేశం చిరు ధాన్యాలకు కేంద్రం అని అన్నారు. పౌష్టికాహారం, ఆహార భద్రత, రైతు పథకాల కోసం చిరుధాన్యాల కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇప్పుడు ప్రభుత్వం శ్రీ అన్న యోజనను ప్రారంభించాలని నిర్ణయించిందని వివరించారు. పోషకాలు అధికంగా ఉండే ధాన్యాల కోసం చిరుధాన్యాల పరిశోధనా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని ఆమె వివరించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా దీనిని ఆర్థిక కాలానికి తొలి బడ్జెట్ గా అభివర్ణించారు.
2023 బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి చేయూత..
భారతదేశం తృణ ధాన్యాలకు ప్రపంచ కేంద్రంగా మారుతుంది.
రైతులకు పౌష్టికాహారం, ఆహార భద్రత, ప్రణాళిక కోసం తృణ ధాన్యాల ఉపోయోగాలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
శ్రీఅన్నా రాడి, శ్రీఅన్నా బజ్రా, శ్రీఅన్నా రందానా, కుంగ్ని, కుట్టు అన్ని ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలను కలిగి ఉన్నాయి.
మినుము రైతులు ప్రజలకు ఎంతో సహకారం అందించారు.
శ్రీఅన్నను హబ్‌గా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
శ్రీఅన్న ప్రొడక్షన్‌కి హైదరాబాద్‌లోని రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ నుంచి చాలా సాయం అందుతోంది.
సహకార్ సే సమృద్ధి...
"సహకార్ సే సమృద్ధి" కార్యక్రమం రైతుల కోసం నడుస్తుంది.
దీని ద్వారా 63000 అగ్రి సొసైటీలను కంప్యూటరీకరిస్తారు.
ఇది రైతులు అభివృద్ధి చెందడానికి దోహదపడుతుంది.
పశుసంవర్ధక, మత్స్య రంగాల్లో రుణాలు ఇవ్వడంలో వేగం పెరుగుతుంది.
మల్టీపర్పస్ కార్పొరేట్ సొసైటీని ప్రోత్సహిస్తారు.
మత్స్య సంపద కోసం కార్పొరేట్ సొసైటీలను కూడా పెంచుతాం

మధ్య తరగతికి ఊరట :
మధ్య తరగతి వర్గాలకు కేంద్ర ప్రభుత్వం భారీ ఉపశమనం కల్పించింది. రూ.7 లక్షల వరకు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదని ప్రకటించింది. ఇకపై రూ.9 లక్షల వరకు ఆదాయం ఉన్నవాళ్లు కేవలం రూ.45వేలు చెల్లిస్తే సరిపోతుందని వెల్లడించింది. ఇంకా పన్ను విధానాల్లో ఎలాంటి మార్పులు చేశారంటే!కొత్త ఆదాయ పన్ను విధానంలో భారీ మొత్తంలో జీతం అందుకుంటున్న వారికీ మోదీ సర్కారు తక్కువ పన్ను అమలు చేస్తోంది. ఇకపై ఏడాదికి రూ.9 లక్షల ఆదాయం పొందుతున్న వారు కేవలం రూ.45,000 చెల్లిస్తే చాలు. అంటే వారి మొత్తం ఆదాయంలో ఇది 5 శాతమే అన్నమాట. ఇప్పటి వరకు చెల్లిస్తున్న రూ.60,000 పన్నులో 25 శాతం భారం తగ్గింది.ఏడాదికి రూ.15 లక్షల ఆదాయం పొందుతున్న వ్యక్తులు వచ్చే ఏడాది నుంచి రూ.1.5 లక్షలు పన్ను చెల్లిస్తే చాలు. అంటే వారి మొత్తం ఆదాయంలో ఇది కేవలం 10 శాతం. అంతకు ముందు రూ.1,87,500 చెల్లించాల్సి వచ్చేంది. అంటే ఇందులో 20 శాతం భారం తగ్గింది.అధిక వేతనాలు పొందుతున్న వారికీ మరో ప్రయోజనం కల్పించారు. వేతన జీవులు, పింఛన్‌దారులు, కుటుంబ పింఛన్‌దారులకు కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్‌ డిడక్షన్‌ పెంచారు. రూ.15.5 లక్షల వార్షిక వేతనం పొందుతున్న వారికి రూ.52,500 ప్రయోజనం కల్పిస్తున్నారు.

దేశానికి సప్తరుషుల మార్గనిర్దేశం, ఉద్యోగ అవకాశలకు  బడ్జెట్ లో పెద్ద పీట :
023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బ‌డ్జెట్‌ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశ పెడుతున్నారు. ఈ బ‌డ్జెట్‌లో ఏడు అంశాల‌కు ప్రాధాన్య‌త ఇస్తున్నట్టు నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. అమృత కాల్ బడ్జెట్‌లో అవి ఒకదానికొకటి సమన్వయంతో సప్త ఋషులుగా  మార్గ నిర్దేశనం చేస్తాయని చెప్పారు. ఈ ప్రాధాన్యతలు దేశాన్ని 'అమృత్ కాల్' వైపు మళ్లిస్తాయని ఆమె పేర్కొన్నారు. ఇవి తమ ప్రభుత్వానికి ఫ్రేమ్‌వర్క్‌గా సీతారామన్‌ అభివర్ణించారు.అలాగే పీవీటీజీ గిరిజనుల కోసం ప్రత్యేక పథకాన్ని నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు పరిశుధ్దమైన నీరు, ఇండ్లు, రోడ్‌,టెలికాం వసతుల కోసం ప్రత్యేక పథకాన్ని తీసుకొస్తున్నట్టు తెలిపారు.  ఇందుకోసం   15 వేల కోట్లు కేటాయించారు. ఈ  మిషన్‌, వచ్చే మూడేళ్లలో వారి సంకక్షేమం కోసం  కృషి చేయనున్నట్టు ఆర్థిక మంతత్రి పార్లమెంటులో వెల్లడించారు. అలాగే ఏకలవ్య మోడల్‌ స్కూళ్లను ప్రకటించారు. ఇందుకోసం భారీ ఎత్తున ఉద్యోగ నియామకాలను చేపడుతున్నట్టు ప్రకటించారు.   మ‌హిళ‌లు, రైతుల‌, యువ‌త‌, వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌కు ప్రాధాన్య‌త ఇస్తున్నట్టు అందుకోసం ప్రత్యక అవకాశాలను కల్పిస్తున్నట్టు తెలిపారు. ప‌ర్యాట‌క రంగాన్ని మ‌రింత ప్రోత్సహించేలా సంస్క‌ర‌ణ‌లు చేపడుతున్నట్టు ప్రకటించారు. వ్యవసాయానికి పెద్దపీటవేయడంతోపాటు, యువ రైతులను ప్రోత్సహించేందుకు అగ్రి స్టార్టప్ లకు ప్రత్యేక నిధి  ఏర్పాటును ప్రకటించారు.  వ్య‌వ‌సాయ రంగంలో స‌వాళ్ల‌ను ఎదుర్కొనేలా  ప్ర‌ణాళిక‌ అని  చెప్పారు.  63 వేల వ్య‌వ‌సాయ ప‌ర‌ప‌తి సంఘాల డిజిట‌లైజేష‌న్‌ చేస్తామని, ఇందుకోసం రూ. 2 వేల కోట్లు కేటాయింపును ప్రకటించారు.ఉద్యోగ, ఉపాధి కల్పనే తమ బడ్జెట్‌ లక్ష్యమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. యువతకు చేయూత అందిస్తామని పేర్కొన్నారు. నిర్దేశించుకున్న లక్ష్యాల్లో గొప్ప పురోగతి సాధించామని వెల్లడించారు. స్వచ్ఛ భారత్‌, పీఎం సురక్షా బీమా యోజన, నగదు బదిలీ, జన్‌ ధన్‌ ఖాతాల్లో ఎన్నో మైలురాళ్లు అధిగమించామని వివరించారు. మంగళవారం ఆమె పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.యువతకు ఉద్యోగాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని నిర్మలా సీతారామన్‌ అన్నారు. ఇందుకోసం భారీగా పెట్టుబడులు పెడుతున్నామని వివరించారు. నైపుణ్యాలు, ప్రతిభాపాటవాలు మెరుగు పర్చుకొనేందుకు యువతకు చేయూతనిందిస్తోందని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థ మరింత వ్యవస్థీకృతంగా మారుతోందని నిర్మల అన్నారు. ఉద్యోగ భవిష్య నిధి ఖాతాలు రెట్టింపవ్వడం దీనిని ప్రతిబింబిస్తోందని తెలిపారు.బడ్జెట్లో ఏడు అంశాలకు ప్రాధాన్యం ఇచ్చామని నిర్మల పేర్కొన్నారు. సమ్మిళిత అభివృద్ధి, అభివృద్ధి ఫలాలను చివరి వ్యక్తి వరకు అందించడం, మౌలిక సదుపాయాల కల్పన, మౌలిక నిర్మాణాలపై పెట్టుబడి, సామార్థ్యాన్ని వెలికి తీయడం, స్వచ్చ ఇంధనం వృద్ధి, యువతకు చేయూత, ఆర్థిక రంగానికి భోరోసా కల్పించడమే తమ లక్ష్యాలని వివరించారు. ప్రజా సంక్షేమమే కేంద్రంగా బడ్జెట్‌ను రూపొందించామని తెలిపారు. విద్యార్థుల కోసం జాతీయ డిజిటల్‌ గ్రంథాలయం స్థాపించామని వెల్లడించారు.మూలధన పెట్టుబడిని 33 శాతం పెంచుతున్నామని నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. రూ.10 లక్షల కోట్లకు పెంచామన్నారు. జీడీపీలో ఇది 3.3 శాతమని తెలిపారు. రైల్వేల కోసం రూ.2.40 లక్షల కోట్లను కేటాయించామన్నారు. 2014తో పోలిస్తే ఇది 9 రెట్లని వివరించారు. ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన 4.0 పథకాన్ని ప్రవేశపెడుతోందని వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయిలో యువత నైపుణ్యాలు పెంపొందించేందుకు 30 స్కిల్‌ ఇండియా ఇంటర్నేషనల్‌ కేంద్రాలను వివిధ రాష్ట్రాల్లో స్థాపిస్తామని చెప్పారు.

Related Posts