YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఫాంకేసు ఎదురుతిరుగుతోంది...

ఫాంకేసు ఎదురుతిరుగుతోంది...

హైదరాబాద్, మార్చి 14, 
ఫాం హౌస్ కేసులో కేసీఆర్ వ్యూహం దెబ్బతింది.  లిక్కర్ స్కాంలో తన కుమార్తె పై సీబీఐ, ఈడీ నజర్ కు కౌంటర్ అన్నట్లుగా ఫామ్ హౌజ్ లో ఎమ్మెల్యేల కొనుగోలు, బేరసారాలకేసును సిట్ కు అప్పగించాలని భావించిన ఆయనకు చుక్కెదురైంది. కేంద్రాన్నికి కేంద్ర దర్యాప్తు సంస్థలు ఉంటే.. మాకు రాష్ట్ర దర్యాప్తు సంస్థలున్నాయంటూ అప్పట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి కూడా. అయితే తన దొరికిన ఆయుధంగా కేసీఆర్ భావించిన ఫామ్ హౌజ్ కేసు దర్యాప్తు ఇప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థ చేతిలోకి వెళ్లి పోయింది. ఫామ్ హౌస్ కేసును సీబీఐకి అప్పగిస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ కేసులో యథాతథ స్థితి (స్టేటస్ కో) కొనసాగుతుందని స్పష్టం చేస్తు విచారణను  జులై 31కి వాయిదా వేసింది.  దీంతో ఫామ్ హౌస్ కేసు దర్యాప్తు ప్రారంభించుందుకు ఇప్పుడిక సీబీఐకి ఎటువంటి అడ్డంకులూ లేదు. కేసు సీబీఐ చేపడితే సాక్ష్యాలు నాశనమైపోతాయంటూ వస్తున్న తెలంగాణ ఇప్పుడు ఏం చేస్తుందో చూడాలి. ఇప్పటి వరకూ ఈ కేసు దర్యాప్తు విషయంలో  ఇప్పుడు సీబీఐ రంగంలోకి దిగడానికి సుప్రీం కోర్టు స్టే ఇస్తుందా లేదా అన్నది వేచి చూడడానికే అని చెప్పవచ్చు. ఇప్పుడు సుప్రీం కోర్టు స్టే నిరాకరించడంతో సీబీఐ దర్యాప్తునకు రూట్ క్లియర్ అయిపోయింది. దీంతో ఏ క్షణంలోనైనా  దర్యాప్తు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. అసలు గతంలోనే.. సీబీఐ ఈ కేసుకు సంబంధించిన   వివరాలు, ఆడియో, వీడియో, డాక్యుమెంట్లు  అందజేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి పలు మార్లు లేఖలు రాసింది.  అయితే ఆ లేఖలకు తెలంగాణ సర్కార్ స్పందించలేదు. సరే సుప్రీం కోర్టు పూర్థి స్థాయిలో స్టేకు నిరాకరించిన తరువాత చూద్దాం అన్నట్లుగా సీబీఐ కూడా అప్పట్లో మిన్నకుండిపోయింది. ఇప్పుడు ఈ కేసు దర్యాప్తు చేపట్టేందుకు లైన్ క్లియర్ అయిపోయిన నేపథ్యంలో ఏ క్షణంలోనైనా సీబీఐ కేసు దర్యాప్తును చేపట్టే అవకాశాలు ఉన్నాయి. దీంతో  ఫాం హౌస్ కేసు తెలంగాణ సర్కార్ మెడకు చుట్టుకున్నట్లే కనిపిస్తోంది ఈ కేసు విషయంలో సీబీఐకి రాష్ట్ర ప్రభుత్వం ఎంత వరకూ సహకారం అందిస్తుందన్న విషయంలో పొలిటికల్ సర్కిల్స్ లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పొరుగున ఉన్న ఏపీలో  వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నో విధాలుగా అడ్డంకులు సృష్టించడాన్ని వారీ సందర్బంగా ప్రస్తావిస్తున్నారు.ఫామ్ హౌస్ కేసులోనూ   తెలంగాణ ప్రభుత్వం కూడా ఫాం హౌస్ కేసు దర్యాప్తు విషయంలో సీబీఐకి   అడ్డంకులు సృష్టించే వ్యూహాన్నే అనుసరించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అదే జరిగితే కేంద్రాన్ని ఇరుకున పెట్టాలనుకున్న కేసీఆర్ వ్యూహం పూర్తిగా బూమరాంగ్ అయినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.    బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫామ్ హౌస్ లో… ముగ్గురు ఎమ్మెల్యేల్ని ప్రలోభపరిచేందుకు  బీజేపీ తరపున రాయబారులుగా వచ్చిన ముగ్గురు వ్యక్తులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు చెందిన ఫామ్ హౌస్ లో దొరికిపోయారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసునే ముఖ్యమంత్రి కేసీఆర్ సిట్ కు అప్పగించారు.  బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి జరిగిన ఈ ప్రయత్నం వెనుక  బీజేపీ పెద్ద నేతలున్నారని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఫాం హౌస్ కేసులో సాక్ష్యాలు ఇవిగో అంటే కొన్ని వీడియోలు, ఆడియోలు మీడియాకు విడుదల చేశారుదేశంలోని అందరు న్యాయమూర్తులకూ పంపారు.  మీడియాకు ప్రదర్శించడమే కాకుండా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దగ్గర నుంచి దేశంలోని అన్ని రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తుల వరకూ అందరికీ పంపారు. ఈ విషయాన్నే ఎత్తి చూపిన తెలంగాణ హైకోర్టు సాక్ష్యాలను అలా ఎలా పంపుతారంటూ సీరియస్ అయ్యింది. ఈ కేసులో సీట్ విచారణ కాదుంటూ.. కేసును.. సీబీఐకి అప్పగించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కేసీఆర్ సర్కార్ సుప్రీం కు వెళ్లింది. అక్కడా కేసీఆర్ కు చుక్కెదురైంది. దీంతో ఫామ్ హౌస్ కేసులో సీబీఐ దర్యాప్తు చేపట్టడం ఖాయమైంది.

Related Posts