YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కేటీఆర్ కు పూర్తి స్ధాయి బాధ్యతలు..?

కేటీఆర్ కు పూర్తి స్ధాయి బాధ్యతలు..?

హైదరాబాద్, మార్చి 16,
టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా పేరు మార్చుకున్న తర్వాత, ముఖ్యమంత్రి కేసీఆర్  రాష్ట్ర రాజకీయాలనే కాదు  పరిపాలన వ్యవహారాలను కూడా పెద్దగా పట్టించుకోవడం లేదని అటు పార్టీ ముఖ్యులు, ఇటు అధికార వర్గాలలో చర్చ జరుగుతోంది. అందుకే, ముఖ్యమంత్రి వద్ద పెండింగ్ ఫైల్స్  కొండలా పెరిగిపోతున్నాయని  అధికారులు ప్రైవేటు సంభాషణల్లో చెపుతున్నారని అంటున్నారు. అలాగే, ముఖ్యమంత్రి కేసీఆర్  పార్టీ  ప్రభుత్వ బాధ్యతలు పూర్తిగా మంత్రి కేటీఆర్ కు అప్పగించి,  ఆయన తెర వెనక సలహాదారు పాత్రకు పరిమితం అయ్యారని  పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. నిజానికి  ముఖ్యమంత్రి కేసీఆర్  జాతీయ రాజకీయాలపై చర్చించే సమయంలో ఒకానొక సందర్భంలో సరదాగానే కావచ్చును రాష్ట్ర రాజకీయాలపై తనకు ఆసక్తి తగ్గిపోతోందని (బోర్ కొడుతోందని) మీడియా సమావేశంలో అన్నారు.  అలాగే 2018లో రెండవ సారి అధికారంలోకి వచ్చింది మొదలు  పార్టీ ప్రభుత్వ పగ్గాలు వారసుడు మంత్రి కేటీఆర్ కు అప్పగించే ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. అనేక సందర్భాలలో మంత్రులు  ఇతర ముఖ్య నేతలు కేటీఆర్ ను కాబోయే ముఖ్య్మంత్రిగా సంభోదించడమే కాకుండా  ముఖ్యమంత్రితో సమాన గౌరవాన్ని ఇవ్వడం కూడా మీడియా దృష్టికి వస్తూనే వుంది. మీడియా చూపుతూనే వుంది. అయితే  కారాణాలు ఏవైనా కేటీఆర్ పట్టాభిషేకం ముహూర్తం వాయిదాపడుతూ వచ్చింది. వస్తోంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ జాతీయ రాజకీయ ఎజెండా తెరపైకి తెచ్చి రాష్ట్ర రాజకీయ, ప్రభుత్వ బాధ్యతల కేతీఆర్ కు అప్పగించి, తాను మెల్లమెల్లగా తెర వెనక్కి తప్పుకుంటున్నారని అంటున్నారు. ఇటీవల చోటు చేసుకున్న రెండు కీలక పరిణామాలను అందుకు ఉదాహరణగా చూపుతున్నారు.ఢిల్లీ లిక్కర్ స్కాం లో చిక్కుకున్న కవితను ఈడీ విచారించిన సమయంలో  మాములుగా అయితే ముఖ్యమంత్రి కేసీఆర్  స్వయంగా ఢిల్లీ వెళ్లి చక్రం తిప్పుతారని అందరూ అనుకున్నారు. కానీ  ముఖ్యమంత్రి ఆ బాధ్యతను కేటీఆర్ కు అప్పగించారు. కేటీఆర్ ను ఢిల్లీ పంపిచారు.  అఫ్కోర్స్  ఆయన వెంట మాజీ ట్రబుల్ షూటర్ మంత్రి హరీష్ రావుతో పాటుగా మరి కొందరు మంత్రులను కూడా ఆయన వెంట పంపినా  మెయిన్ టాస్క్ మాత్రం కేటీఆర్ చేతుల మీదగానే కానిచ్చారు. అందుకే ఫైనల్ గా,  ఢిల్లీలో చక్రం తిప్పిన కేటీఆర్  అంటూ మీడియాలో ప్రచారం జరిగింది. న్నికలకు పార్టీని సిద్ధం చేసే బాధ్యతను కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ కు అప్పగించారని అంటున్నారు. ఢిల్లీ ఎపిసోడ్ తర్వాత  కేటీఆర్ పార్టీ మీద దృష్టి పెట్టారు. ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడి స్థాయిలో తీసుకోవలసిన కీలక నిర్ణయాలు అయన స్వయంగా తీసుకుంటున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులతో ప్రత్యేకంగా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వచ్చే కొద్ది నెలల్లో విస్తృతంగా కార్యక్రమాల నిర్వహణకు షెడ్యూల్‌ను ఖరారు చేశారు. ఎన్నికల్ రోడ్ మ్యాప్  ను సిద్డంచేశారు. ఇటీవల పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుకు కేటీఆర్‌ వివిధ స్థాయి నాయకులు కార్యకర్తలతో టెలీకాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తున్నారు. అలాగే, వివిధ స్థాయిల్లో సమన్వయం పై దృష్టి సారించారు. పార్టీలో క్షేత్ర స్థాయి నుంచి పై స్థాయి వరకు సమన్వయం కొనసాగేలా కార్యక్రమాలను రూపొందించారు.అందులో భాగంగా తక్షణమే ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణకు శ్రీకారం చుట్టనున్నారు. అందు కోసం ప్రత్యేకంగా జిల్లాల వారీగా కొత్తగా ఇన్‌చార్జీలను నియమించారు.  అలాగే జిల్లా కార్యాలయాల ఏర్పాటుకు షెడ్యులు ఖరారు చేశారు. ఈ పరిణామాలను గమనిస్తే కేసీఆర్  పార్టీ, ప్రభుత్వ పగ్గాలను  వారసుడు కీటీఆర్ కు అప్పగించి తాను రాష్ట్ర  రాజకీయాల నుంచి వీఆర్ఎస్ తీసుకునే దిశగా అడుగులు వేస్తున్న వైనం కనిపిస్తోందని అంటున్నారు.

Related Posts