YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

అప్పుల తెలంగాణాగా మార్చారు భట్టి విక్రమార్క

అప్పుల తెలంగాణాగా మార్చారు భట్టి విక్రమార్క

హైదరాబాద్
హాత్ సే హాత్ జోడో పాదయాత్రకు బయలుదేరే ముందు కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ నేత భట్టి విక్రమార్క హైదరాబాద్లని తన ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత అయన మీడియాతో మాట్లాడారు. టీఎస్ పిఎస్సీలో జరిగిన ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై నైతిక బాధ్యత వహిస్తూ సంబంధిత మంత్రి తక్షణమే రాజీనామా చేయాలి. ప్రభుత్వ బాధ్యత రాహిత్యం వల్లనే పేపర్ లీకేజీ జరిగినట్టు స్పష్టం అవుతున్నది. పేపర్ లీకేజీ కావడం వల్ల నిరుద్యోగులను చూస్తుంటే నాకు ఆవేదన కలుగుతున్నది. అవకతవకలు జరిగితే మంత్రులు రాజీనామా చేయాలన్న భయం ఉంటే రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఉండవని అన్నారు. ప్రశ్నపత్రాల లీకేజీ తో విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటం ఆడుతున్నది. పేపర్ లీకేజీ వ్యవహారం పై సమగ్ర దర్యాప్తు జరపాలి. ఎంతటి పెద్దవారు ఉన్న బాధ్యులపై కఠినంగా చర్యలు తీసుకోవాలి. ప్రజల ఆకాంక్షలు, లక్ష్యాలు, ఆశలు నెరవేరాలని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. దశాబ్ద బిఆర్ఎస్ పరిపాలనలో తెలంగాణ ప్రజల లక్ష్యాలు ఏ ఒక్కటి నెరవేరలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 18 లక్షల కోట్ల బడ్జెట్ సంపద దుర్వినియోగం అయింది.  రాష్ట్రంలో ఐదు లక్షల కోట్లు అప్పులు చేసిఅప్పుల తెలంగాణగా మార్చిన బిఆర్ఎస్ సర్కారని అన్నారు.
సాగునీటి ప్రాజెక్టులకు లక్షల కోట్లు ఖర్చు చేశామని చెప్పుకుంటున్న బిఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా ఏ ఒక్క ఎకరానికి నీరు ఇవ్వలేదు. గత కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టులకు కాలేశ్వరం పేరు పెట్టి ఆ ప్రాజెక్టు కట్టామని అంటే ఎట్లా? బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఎత్తిపోతల ప్రాజెక్టుల నుంచి ఒక ఎకరానికి నీళ్లు ఇవ్వలేదు. పాలమూరు రంగారెడ్డి పనులు దశాబ్ద కాలంగా సాగుతూనే ఉన్నాయని అన్నారు.
తెలంగాణ ప్రజలు ఆశించిన ఆత్మగౌరవం దక్కడం లేదు. ప్రశ్నించడం పాపం అన్నట్టుగా ప్రశ్నించిన వారిని అరెస్టులు చేయడం, అక్రమ కేసులు పెట్టడం, జైల్లో నిర్బంధించి ప్రజల ఆత్మగౌరవాన్ని కాలరాస్తున్న  బిఆర్ఎస్ ప్రభుత్వం. నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మ గౌరవం కోసం తెచ్చుకున్న తెలంగాణ లక్ష్యాలు నెరవేరకపోవడంతో నిరాశ నిస్పృహల్లో ప్రజలు ఉన్నారు. నిరాశ నిస్పృహల్లో ఉన్న ప్రజలకు అధైర్య పడొద్దని  తొమ్మిది నెలల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో వస్తుందన్న ధైర్యం కల్పించడం కోసమే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నానని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే తెలంగాణ ప్రజల ఆశలు ఆకాంక్షల లక్ష్యాలు నెరవేరడం సాధ్యమని అన్నారు.

Related Posts