YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

తెలంగాణ ప్రభుత్వంపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజం

తెలంగాణ ప్రభుత్వంపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజం

హైదరాబాద్ మే 27
తెలంగాణ ప్రభుత్వంపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ టార్గెట్‌గా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. 2014లో సీఎంగా ప్రమాణస్వీకారం చేయకముందే కేసీఆర్ తల నరుక్కోవాలని వ్యాఖ్యానించారు. దళిత సీఎం, మూడెకరాల భూమి, డబుల్‌ బెడ్రూం ఇళ్లు సహా కొన్ని వందల సార్లు తెలంగాణ సీఎం కేసీఆర్ మాట తప్పారని విమర్శించారు. తెలంగాణకు కేంద్రం సాయంపై చర్చకు సిద్ధమని కేసీఆర్‌కు కిషన్ రెడ్డి సవాలు విసిరారు. తెలంగాణ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ కంపెనీగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో దేశవ్యాప్తంగా డబ్బులు పంచడం కోసమే 111 జీవో రద్దు చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలకు 111 జోవో పరిధిలో వందలాది ఎకరాలున్నాయన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు కలసి మాట్లాడుకుని కార్యాలయాలకు భూములు తీసుకున్నారని ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబానికి భూ దాహం, అప్పుల దాహం తీరటం లేదని ధ్వజమెత్తారు. నీతి ఆయోగ్ సమావేశానికి సీఎం‌ కేసీఆర్ హాజరుకావపోవటం తెలంగాణకు తీవ్ర నష్టం అన్నారు. నీతి ఆయోగ్ సమావేశం కంటే కేసీఆర్‌కు ముఖ్యమైన పని ఏముందో చెప్పాలని డిమాండ్ చేశారు.

Related Posts