YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

టార్గెట్ తెలంగాణ మోడీ భారీ రోడ్ షో

టార్గెట్ తెలంగాణ మోడీ భారీ రోడ్ షో

హైదరాబాద్, జూన్ 7, 
తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో భారతీయ జనతా పార్టీ  తెలంగాణపై ఫోకస్ పెంచింది. తెలంగాణలో మరికొద్ది నెలల్లో ఎన్నికలు ఉండడం వల్ల బీజేపీ అధిష్ఠానం రాష్ట్రంపై ఫోకస్ పెట్టింది. జనాల్లో బీజేపీ ఊపు తగ్గకుండా, మరింత పెంచడానికి నిరంతరం ప్రజల్లో ప్రణాళికలు బీజేపీ వేస్తోంది. ఇప్పటికే ప్రజాసంగ్రామ యాత్ర పేరుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజల్లోకి వెళ్లగా, తాజాగా మహా జన సంపర్క్ అభియాన్ పేరిట మరోసారి బీజేపీ జనాలను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ఇకపై వరుసగా బీజేపీ అగ్రనేతలను తెలంగాణకు తీసుకురానున్నారు.ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పర్యటనలు ఖరారు అయిన సంగతి తెలిసిందే. త్వరలోనే ప్రధాని మోదీని కూడా తెలంగాణకు ఆహ్వానించనున్నారు. మహా జన్ సంపర్క్ అభియాన్ లో భాగంగా ఈ నెలలో మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నిర్వహించే రోడ్ షోలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. కర్ణాటక తరహాలోనే హైదరాబాద్ లో కూడా ప్రధాని మోదీ రోడ్ షో ఏర్పాట్లు చేస్తున్నట్లుగా బీజేపీ వర్గాలు తెలిపాయి. మల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిలో మోదీ రోడ్ షోతో పాటు సికింద్రాబాద్ లేదా హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారని చెబుతున్నారు. రెండు రోజుల్లో మోదీ పర్యటనకు సంబంధించి తేదీలు, స్థలాలు ఖరారు అయ్యే అవకాశం ఉందని సమాచారం.ఎలాగైనా అధికారంలోకి రావాలన్న ఆకాంక్షతో వ్యూహాలకు పదును పెడుతోంది. మిషన్‌ 90 టార్గెట్‌గా కారు స్పీడ్‌కు బ్రేకులు వేసేందుకు యాక్షన్‌ప్లాన్‌ రచిస్తోంది. కర్ణాటక ఫలితాల ఎఫెక్ట్ తెలంగాణపై పడకుండా.. కసరత్తు ప్రారంభించింది. ఐదు నెలలకు ముందుగానే బీజేపీ సమరశంఖాన్ని పూరించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. వరుసగా సమావేశాలను నిర్వహించడంతోపాటు.. చేరికలు.. పార్టీ విస్తరణ తదితర వ్యూహాలతో ఢిల్లీ పెద్దలు రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలనే రాష్ట్ర నేతలతో భేటీ అయిన అమిత్ షా.. జేపీ నడ్డా.. పలు కీలక సూచనలు చేశారు. సమన్వయంతోనే లక్ష్యం సాధించవచ్చన్న విషయాన్ని చెప్పడంతోపాటు..హైకమాండ్ యాక్షన్ ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్లాలని సూచించారు. అంతేకాకుండా.. ఢిల్లీ పెద్దల అండ ఎప్పుడూ ఉంటుందని హామీ సైతం ఇచ్చారు.ఈ క్రమంలోనే తెలంగాణలో బీజేపీని ఎలాగైనా అధికారంలో తీసుకువచ్చేందుకు ఏకంగా ప్రధాని మోడీనే రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో పార్టీ వ్యూహాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. త్వరలోనే పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల హైదరాబాద్‌లో ప్రధాని మోడీ రోడ్డు షో నిర్వహించనున్నట్లు సమాచారం. ఎన్నికల వ్యూహంలో భాగంగానే ప్రధాని మోడీ.. తెలంగాణపై ఫుల్‌ ఫోకస్‌ తో రంగంలోకి దిగనున్నట్లు కాషాయ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ప్రధాని మోడీ హైదరాబాద్‌ పర్యటన, రోడ్డు షోపై పీఎంఓ నుంచి అనుమతి వచ్చిన తర్వాత బిజెపి అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.అంతకుముందు అమిత్‌ షా సైతం తెలంగాణలో పర్యటించనున్నారు. 15న ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభలో హోంమంత్రి అమిత్‌షా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ నేతలతో కూడా ఆయన సమావేశం కానున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో వ్యూహాలు.. సన్నాహాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

Related Posts