YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

కైలాసా దేశానికి ప్రధానిగా రంజిత

కైలాసా దేశానికి ప్రధానిగా రంజిత

న్యూఢిల్లీ, జూలై 7, 
మనదేశంలో ప్రజలకు దేవుళ్ళు అన్నా, దేవుళ్ళకు సంబందించిన ఏదైనా కూడా ఇట్లే నమ్మేస్తుంటారు.. అందుకే వీధికో గుడి దర్శనమిస్తుంది..ఈ నమ్మకాన్నే కొందరు క్యాష్ చేసుకుంటున్నారు.. అది అడ్డు పెట్టుకొని కొందరు దొంగ బాబాలు విచ్చల విడిగా డబ్బులను సంపాదిస్తున్నారు.. మరికొందరు భక్తి ముసుగులో అక్రమాలకు, దారుణాలకు ఒడిగట్టారు.. అలాంటి వారి లిస్ట్ నిత్యానంద స్వామీ పేరు మొదటగా వినిపిస్తుంది.. ఈ వివాదాస్పద ఆధ్యాత్మిక గురువురుకు సంబంధించిన రాసలీలల వీడియో 2010లో వెలుగులోకి రావడంతో దేశంలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ఒకప్పటి హీరోయిన్‌ రంజితతో ఆయన ఏకాంతంగా కలిసున్న దృశ్యాలు అప్పటిలో ఎంతగా వైరల్ అయ్యాయో చూసే ఉన్నాం..అదంతా అబద్దమని, నేను అస్సలు మగాడినే కాదని స్వామి ఒక స్టేట్ మెంట్ ఇచ్చాడు.. అయినా ఎవ్వరు నమ్మలేదు.. అయితే అప్పటి నుంచి స్వామికి ఏదోక వివాదం తెర లేపుతుంది..అత్యాచారం, కిడ్నాప్‌ లాంటి కేసులు ఎదుర్కొంటూ 2019లో దేశం విడిచి పారిపోయాడు. ఆపై కొన్నాళ్లకు యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ కైలాస దేశాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు ప్రకటించాడు. కానీ ఇంతవరకు ఈ కైలాస దేశం ఎక్కడుందనే స్పష్టత లేదు. తాజాగా ఈ దేశానికి తన ప్రియ శిష్యురాలు, మాజీ నటి రంజితను ప్రధానిని చేసినట్లు కోలీవుడ్‌ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి..ఈమె 1992లో ‘నాదోడి థెండ్రల్‌’ తమిళ సినిమాతో రంగప్రవేశం చేసింది. కొంతకాలానికే స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. తమిళం పాటు తెలుగు, మలయాళం, కన్నడ సినిమాల్లో అగ్ర హీరోలతో కలిసి నటించింది. 1996లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘మావిచిగురు’ సినిమాకు ఉత్తమ సహాయనటిగా నంది అవార్డు అందుకుంది..సినిమా కేరీర్ పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకుంది..నిత్యానంద మాయలో పడటంతో 2017లో భర్తకు విడాకులిచ్చింది. నిత్యానంద ఆశ్రమానికి తన నివాసాన్ని షిఫ్ట్‌ చేసిన ఆమె 2013 చివర్లో ఆనందమయిగా పేరు మార్చుకుంది. రంజితతో పాటు ఆమె సోదరి కూడా భర్తకు విడాకులిచ్చి నిత్యానందతోపాటే తిరుగుతున్నారు.. మరి ఈ వార్తలో నిజమేంత ఉందో తెలియాల్సి ఉంది..

Related Posts